ఆ హీరో కుమార్తె తో చాలా ఇబ్బంది పడ్డాం!
ఈ సందర్భంగా సుహానాఖాన్ తీరుతో బాగా ఇబ్బంది పడినట్లు కూడా తెలిపాడు. ' సుహానాఖాన్ మంచి వ్యక్తి. అందరితో కలిసి పోతుంది అన్నాడు. ex
By: Tupaki Desk | 9 Oct 2024 10:30 PM GMT'ది అర్చీస్ ' తో కొంత మంది స్టార్ వారసులు పరిచయమైన సంగతి తెలిసిందే. అందులో షారుక్ ఖాన్ ముద్దుల కుమార్తె సుహానాఖాన్ కూడా ఉంది. ఇందులో అమ్మడు వేదాంగ్ రైనాకు జంటగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేదాంగ్ రైనా 'జిగ్రా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అలియాభట్ కిజోడీగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తొలి సినిమా అనుభవాల్ని పంచుకున్నాడు.
ఈ సందర్భంగా సుహానాఖాన్ తీరుతో బాగా ఇబ్బంది పడినట్లు కూడా తెలిపాడు. ' సుహానాఖాన్ మంచి వ్యక్తి. అందరితో కలిసి పోతుంది అన్నాడు. అదే సమయంలో విలేకరు ఆమెతో మీరు ఇబ్బంది పడ్డారా? అనగా? 'ఆమె రెడీ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. సెట్ లో ఉన్న వాళ్లంతా పావుగంటలో రెడీ అయ్యే వాళ్లం. కానీ సుహానా ఖాన్ కోసం మాత్రం నలభై నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చేది.
జుట్టు బాలేదు. మ్యాకప్ సరిగ్గా లేదు అంటూ మధ్యలో టీమ్ అందరికీ ఇబ్బంది కలిగించేది. దీంతో అందరం చాలా అసౌకర్యానికి గురయ్యాం. చీటికి మాటికి ఇరిటేషన్ తెప్పించేది. అలాగని సుహానాని తప్పు పట్టాల్సిన పనిలేదు. ఆ తప్పు ఆమె పాత్రది. పాత్రకి అనుగుణంగా మ్యాకప్ అవ్వడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతోనే అలా జరిగేది. అలాగే ఖుషీ కపూర్ గురించి మాట్లాడుతూ..' తను మాత్రం చాలా స్వీట్.. సరదాగా ఉంటుంది.
కొన్ని సందర్బాల్లో తనని తాను తక్కువ అంచనా వేసుకుంటుంది. అది నాకు నచ్చదు. కొన్ని విషయాల్లో ఆత్మన్యూనతకు లోనవుతుంటుంది. మరి అలా ఎందుకు చేస్తుందో అమెకే తెలియాలి' అన్నాడు. ది అర్చీస్ సమయంలో ఖుషీ కపూర్ -వేదాంగ్ రైనా లవ్ లో పడ్డట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.