విశ్వంభరలో మరో వీణ పాట..?
ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వశిష్ట తొలి సినిమా బింబిసారకు కీరవాణి మ్యూజిక్ అందించారు.
By: Tupaki Desk | 19 Feb 2025 10:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో వస్తున్న విశ్వంభర సినిమా ఆడియన్స్ కు విజువల్ ఫీస్ట్ అందించేందుకు వస్తుంది. సినిమా దాదాపు పూర్తి కాగా కొంత వి.ఎఫ్.ఎక్స్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉందని తెలుస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే చేస్తున్నారని టాక్. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వశిష్ట తొలి సినిమా బింబిసారకు కీరవాణి మ్యూజిక్ అందించారు.
చిరంజీవి సినిమాకు కీరవాణి మ్యూజిక్ అంటే అది సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఐతే చిరు సినిమాలో సాంగ్స్ అంటే డ్యాన్స్ ఉండేలా కూడా చేస్తారు. ఐతే ఈమధ్య చిరు సింపుల్ స్టెప్పులతో కానిచ్చేస్తున్నారు. మరోసారి మెగాస్టార్ కాలు కదిపితే ఎలా ఉంటుందో విశ్వంభరలో చూపించబోతున్నారట. ముఖ్యంగా చిరు ఇంద్ర సినిమాలో వీణ స్టెప్ లాంటిది విశ్వంభర లో ప్లాన్ చేస్తున్నారట.
మెగాస్టార్ చిరంజీవి వీణ స్టెప్పు వేస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. విశ్వంభర లో మళ్లీ అలాంటి కంపోజింగ్ చేస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క. కొన్నాళ్లుగా చిరంజీవి మార్క్ సినిమా రావట్లేదని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి విశ్వంభర కచ్చితంగా మెగా మేనియా చూపిస్తుందని అంటున్నారు. వశిష్ట అటు కథ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండానే మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన కమర్షియల్ అంశాలు అన్నీ పెడుతున్నట్టు తెలుస్తుంది.
మెగా విశ్వంభర నిజంగానే ఫ్యాన్స్ అంచనాలను మించి ఉంటే మాత్రం బాస్ బాక్సాఫీస్ షేక్ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. భోళా శంకర్ తో నిరాశ పడ్డ మెగా ఫ్యాన్స్ విశ్వంభరతో చిరు మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. మరి చిరంజీవి వశిష్ట ఏం చేస్తారన్నది చూడాలి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆషిక రంగనాథ్ తో పాటుగా ఇషా చావ్లా కూడా నటిస్తుందని తెలుస్తుంది. మీనాక్షి చౌదరి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తుందని టాక్. చిరంజీవి సినిమా హిట్ టాక్ వస్తే ఆ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబ 150తో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ ఆ తర్వాత ఆ తర్వాత వాలేరు వీరయ్యతో సక్సెస్ అందుకున్నా ఎందుకో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అందుకే వారి ఆకలి తీర్చేలా ఒక విజువల్ వండర్ తో రాబోతున్నాడు చిరు. మరి ఈ సినిమా అయినా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.