Begin typing your search above and press return to search.

అంబానీ ఇంట మెరిసిన వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి!

అంబానీ ఇంట పెళ్లికి టాలీవుడ్ నుంచి కొంత మంది సెల‌బ్రిటీలు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 July 2024 10:30 AM GMT
అంబానీ ఇంట మెరిసిన వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి!
X

అంబానీ ఇంట పెళ్లికి టాలీవుడ్ నుంచి కొంత మంది సెల‌బ్రిటీలు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేకంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు అంబానీ ఇంట స్పెష‌ల్ గా హైలైట్ అయ్యారు. వాళ్ల‌తో పాటు బాలీవుడ్..హాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా అదే వేడుక‌లో మెరిసారు. వారంద‌రి ముందు వీణ‌ లైవ్ పెర్పార్మెన్స్ ఇచ్చే అవ‌కాశం మాత్రం తెలుగు నుంచి వీణ శ్రీవాణికి ద‌క్క‌డం గొప్ప విష‌యంగా చెప్పాలి.

ఎంతో మంది వీణ విధ్వంసులున్నారు. కానీ వారెవ్వ‌రికీ రాని అవ‌కాశం శ్రీవాణికి రావ‌డం గ్రేట్ గానే చెప్పాలి. అతి ర‌ధ‌మ‌హార‌ధులంద‌రి ముందు శ్రీవాణి త‌న వీణతో అంద‌ర్ని రంజింప జేసారు. ఈ సంద‌ర్భంగా శ్రీవాణి సంతోషం వ్య‌క్తం చేసారు. తెలుగువారి తరఫున అనంత్ అంబానీ వెడ్డింగ్ లో స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

వీణ శ్రీవాణికి అంబానీ కుటుంబం ఆదరణ మన తెలుగు దనాన్ని, సంప్రదాయాన్ని ప్ర‌తిబింబించేలా తన దుస్తుల్ని నీతా అంబానీ ఎంపిక చేసార‌ని, అలాగే వీణ ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ కూడా చాలా అద్భుతంగా ఉందని వీణ శ్రీవాణి అభిప్రాయ‌ప‌డ్డారు. అంబానీ కుటుంబం త‌న‌ని ఎంతో బాగా చూసుకుంద‌ని, ఎక్క‌డా అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఎంతో గౌర‌వించి, ప్ర‌ద‌ర్శ‌న‌కు చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పించార‌ని అన్నారు.

శ్రీవాణి ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి స‌తీమ‌ణి అన్న సంగ‌తి తెలిసిందే. సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ వేణు స్వామి ఎంతో ఫేమ‌స్ అయ్యారు. అటుపై రాజ‌కీయ నాయ‌కులు జాత‌కాలు కూడా చెప్పారు. కానీ ఏపీలో ఆయ‌న చెప్పిన రాజ‌కీయ జాత‌కం ఫ‌లించ‌క‌పోవ‌డంతో రాజకీయ నాయ‌కులు జాత‌కాలు చెప్ప‌న‌ని ఫ‌లితాల అనంత‌రం ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియాలో ఈయ‌నకు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.