Begin typing your search above and press return to search.

చియాన్ విక్రం కి సాహసాలు అల్వాటే.. కానీ..?

కానీ చియాన్ విక్రం వీర ధీర శూర సినిమా పార్ట్ 2 ని ముందు రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   20 March 2025 6:30 AM IST
చియాన్ విక్రం కి సాహసాలు అల్వాటే.. కానీ..?
X

ఈమధ్య సినిమాలను కొత్తగా తీస్తే తప్ప ప్రేక్షకులు మెచ్చుకునేలా లేరు. అది అర్ధమైన కొందరు ఫిల్మ్ మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ సినిమాల్లో కొత్త కాన్సెప్ట్ లు తెస్తున్నారు. ఇక సినిమా మొదలు పెట్టడానికి ముందే రెండు పార్ట్ లుగా డిసైడ్ అయ్యి చేస్తున్న విషయం తెలిసిందే. బాహుబలితో మొదలైన ఈ రెండు భాగాల సినిమా హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బాహుబలి 1, 2 సినిమాలకు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు రాజమౌళి. ఆ సినిమా చూపిన బాటలో చాలా సినిమాలు వచ్చాయి.

ఇక కొత్తగా ఉండాలని కన్నడ హీరో రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి అనే సినిమా రెండు భాగాలుగా చేసి రెండిటిని 7 వారాల గ్యాప్ తో రిలీజ్ చేశాడు. ఆ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఐతే ఇప్పుడు చియాన్ విక్రం ఇంకాస్త ముందడుగు వేసి వీర ధీర శూర సినిమాతో ఎవరు చేయని రిస్క్ చేస్తున్నాడు. అదేంటి అంటే ఏదైనా సినిమా మొదటి భాగం రిలీజ్ అయ్యాక రెండో భాగం వదులుతారు.

కానీ చియాన్ విక్రం వీర ధీర శూర సినిమా పార్ట్ 2 ని ముందు రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను అరుణ్ కుమార్ డైరెక్ట్ చేశారు. కోలీవుడ్ లో తొలి సినిమా పరియేరుం పెరుమాళ్ తో ఆకట్టుకున్న డైరెక్టర్ అరుణ్ కుమార్ ఆ తర్వాత సేతుపతి, సిధునాద్ సింధుబాద్ సినిమాలు చేశాడు. ఐతే రెండేళ్ల క్రితం సిద్ధార్థ్ తో చేసిన చిన్నా సినిమా ప్రశంసలు అందుకుంది.

చియాన్ విక్రం ఈ డైరెక్టర్ తో సినిమా అనగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఐతే వీర ధీర శూర పార్ట్ 2 ని ముందు వదిలి ఆ తర్వాత మొదటి భాగం షూట్ చేస్తారట. వినడానికి కాస్త వింతగా ఉన్నా సరే ఇది చాలా రిస్కీ అన్న విషయం తెలిసిందే. చియాన్ విక్రం లాస్ట్ తంగలాన్ సినిమాతో పర్వాలేదు అనిపించాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. వీర ధీర శూర సినిమాలో ఎస్ జె సూర్య నటించాడు. సినిమా వచ్చే వారం రిలీజ్ ఉన్నా ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. ఐతే పార్ట్ 2 తో ముందొచ్చి సినిమాతో సక్సెస్ అందుకుంటామని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి ప్రయత్నాలే మరికొందరు చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.