విక్రమ్ వీర దీర శూర టీజర్ టాక్..!
రేషన్ డీలర్ అయిన విక్రమ్ కి పోలీస్ ఆఫీసర్ ఎస్.జె సూర్య మధ్య జరిగే యుద్ధమే వీర ధీర శూర సినిమా కథ అని తెలుస్తుంది.
By: Tupaki Desk | 15 March 2025 7:22 PM ISTచియాన్ విక్రమ్ హీరోగా యాక్షన్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా వీర ధీర శూర. ఈ సినిమాను ఎస్.యు అరుణ్ కుమార్ డైరెక్ట్ చేశారు. సిద్ధార్థ్ తో చిత్తా అదే తెలుగులో చిన్నా గా రిలీజైన సినిమాను డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు విక్రం తో వీర ధీర శూర సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాను హెచ్.ఆర్ పిక్చర్స్, రియా శిభు నిర్మించారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్.
రేషన్ డీలర్ అయిన విక్రమ్ కి పోలీస్ ఆఫీసర్ ఎస్.జె సూర్య మధ్య జరిగే యుద్ధమే వీర ధీర శూర సినిమా కథ అని తెలుస్తుంది. సినిమా టీజర్ లో కథ గురించి పక్కన పెడితే విజువల్స్, బిజిఎం విక్రం యాక్షన్ ఇవన్నీ అదిరిపోయాయి. చాలా రోజుల తర్వాత విక్రం తన మార్క్ సినిమాతో వస్తున్నాడని టీజర్ చూస్తేనే అనిపించింది.
తంగళాన్ తో వచ్చి పర్వాలేదు అనిపించుకున్న విక్రం ఈసారి వీర ధీర శూర తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడని అర్థమవుతుంది. సినిమాకు జివి ప్రకాష్ మ్యూజిక్ మరో హైలెట్ అయ్యేలా ఉంది. సినిమా టీజర్ తోనే ఆడియన్స్ లో మంచి పాజిటివ్ బజ్ ఏర్పరచుకున్నారు.
చియాన్ విక్రమ్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శివపుత్రుడు, అపరిచితుడు సినిమాల టైం నుంచి విక్రమ్ సినిమాలు తెలుగులో బాగా ఆడాయి. ఐతే ఈమధ్య పూర్తిగా ఫాం కోల్పోయిన ఆయన తిరిగి ఫాంలోకి రావాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. సినిమాలో విక్రమ్ తో పాటుగా ఎస్.జె సూర్య, సూరజ్ వెంజరమూడు, దసరా విజయన్ నటిస్తున్నారు.
మార్చి 27న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. సినిమా టీజర్ చూస్తే విక్రం కోరుకుంటున్న సూపర్ హిట్ దక్కేలానే ఉంది. చియాన్ విక్రం సినిమా అంటే చాలు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసేవాళ్లు. ఐతే ఈమధ్య ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అందుకే విక్రం సినిమా అంటే ఇదివరకు ఉన్నంత బజ్ లేదు. ఐతే వీర ధీర శూర టీజర్ మాత్రం అంచనాలు పెంచేలా ఉంది. సినిమా హిట్ పడితే మాత్రం విక్రం తిరిగి ఫాం లోకి వచ్చినట్టే లెక్క అని చెప్పొచ్చు.