విక్రమ్ 'వీర ధీర సూరన్'.. రిలీజ్ అప్పుడేనా?
అయితే విక్రమ్ ప్రస్తుతం వీర ధీర సూరన్ మూవీతో బిజీగా ఉన్నారు.
By: Tupaki Desk | 29 Nov 2024 4:30 PMకోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. రీసెంట్ గా తంగలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇండిపెండెన్స్ డే కానుకగా థియేటర్లలో రిలీజైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తరు హిట్ గా నిలిచింది. కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో మూవీ హిట్ కాలేనప్పటికీ విక్రమ్ లుక్, యాక్టింగ్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.
అయితే విక్రమ్ ప్రస్తుతం వీర ధీర సూరన్ మూవీతో బిజీగా ఉన్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కతున్న ఆ సినిమాకు ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై రియా శిబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
తెన్ కాశీలో భారీ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నట్లు కొద్ది రోజుల తెలిపారు మేకర్స్. అదే సమయంలో మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పక్కా మాస్ అవతార్ లో చియాన్ విక్రమ్.. సినిమాలో అభిమానులను మెప్పించడం ఖాయంగా ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అర్థమవుతుంది.
అయితే సినిమా రెండు పార్టుల్లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కానీ టైటిల్ టీజర్ వచ్చాక సెకండ్ పార్ట్ ముందు రిలీజ్ అవుతున్నట్లు అర్థమవుతుంది. టైటిల్ టీజర్ కూడా రెండో పార్ట్ కు సంబంధించినేదనని సమాచారం. నార్మల్ గా ఏ సినిమాకు అయినా ఫస్ట్ పార్ట్ ముందు రిలీజ్ అవుతుంది. కానీ వీర ధీర సూరన్ విషయంలో విక్రమ్ ముందుగా సెకండ్ పార్ట్ తో సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను మేకర్స్ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపించగా.. ఇప్పుడు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ను త్వరలోనే మేకర్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. టీజర్ ను విడుదల చేస్తూ.. రిలీజ్ డేట్ ను రివీల్ చేయనున్నారట.
ఇక సినిమా విషయానికొస్తే.. నటి దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్ జే సూర్య, సురాజ్ వెంజరమూడు, సిద్ధిక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి వీర ధీర శూరన్ మూవీతో చియాన్ విక్రమ్.. ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.