Begin typing your search above and press return to search.

వీరాంజనేయులు విహారయాత్ర… మరో నవ్వుల జర్నీ

ఇందులో చక్కని ప్రేమకథని, కుటుంబ బంధాలని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సీనియర్ యాక్టర్ నరేష్ లీడ్ రోల్ లో వీరాంజనేయులు విహార యాత్ర అనే వెబ్ సిరీస్ ని తీసుకొని రాబోతున్నారు.

By:  Tupaki Desk   |   1 Aug 2024 9:40 AM GMT
వీరాంజనేయులు విహారయాత్ర… మరో నవ్వుల జర్నీ
X

ఈటీవీ విన్ లో ఈ మధ్యకాలంలో సింపుల్ గా మిడిల్ క్లాస్ జనాలకి కనెక్ట్ అయ్యే కథలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. మిగిలిన ఓటీటీ ఛానల్స్ లో థ్రిల్లర్, యాక్షన్, ఫాంటసీ జోనర్ లో మూవీస్, వెబ్ సిరీస్ లు చేస్తూ ఉంటే ఈటీవీ విన్ లో మాత్ర మన మధ్య జరిగే మన కథలని వినోదం జోడించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన 90s వెబ్ సిరీస్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. శివాజీ ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేశారు.

ఓ విధంగా ఆ వెబ్ సిరీస్… చూసే ప్రతి ఒక్కరిని తమ చిన్న నాటి రోజులకి తీసుకొని వెళ్ళిపోయింది. గత నెలలో శశి మధనం అనే వెబ్ సిరీస్ ని ఈటీవీ విన్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇదికూడా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఇందులో చక్కని ప్రేమకథని, కుటుంబ బంధాలని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సీనియర్ యాక్టర్ నరేష్ లీడ్ రోల్ లో వీరాంజనేయులు విహార యాత్ర అనే వెబ్ సిరీస్ ని తీసుకొని రాబోతున్నారు.

కొద్ది రోజుల క్రితం ఈ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయ్యింది. చనిపోయిన తండ్రి అస్థికలుని గోవాలోని సముద్రంలో కలపడానికి పాతకాలం వెహికల్ లో ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తారు. ఈ ప్రయాణంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది వెబ్ సిరీస్ లో వినోదభరితంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అనురాగ్ పాలుట్ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

సీనియర్ యాక్టర్ శ్రీలక్ష్మి ఈ సిరీస్ లో నరేష్ తల్లిగా నటించింది. ప్రియా వడ్లమాని, రాగ మయూర్ కీలక పాత్రలలో నటించారు. టీజర్ చూస్తుంటే వీరాంజనేయులు విహారయాత్ర వెబ్ సిరీస్ లో కావాల్సినంత వినోదం ఉన్నట్లు అనిపిస్తోంది. అలాగే మరోసారి ప్రేక్షకులని మధ్యతరగతి జీవితాలు, ఆ జ్ఞాపకాల్లోకి తీసుకొని వెళ్ళబోతున్నట్లు అర్ధమవుతోంది. ఆగష్టు 14న ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో రిలీజ్ కాబోతోంది. 90s తరహాలో ఈ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందేమో అనేది చూడాలి.