Begin typing your search above and press return to search.

GOAT డైరెక్టర్ మరో మూవీ.. అప్పుడెప్పుడో షూట్ అయినా..

సత్యరాజ్, రమ్యకృష్ణ, నివేత పేతురాజ్, రెజీనా కసాండ్రా, జయరాం, శ్యామ్, నాజర్ ముఖ్య పాత్రల్లో డైరెక్టర్ వెంకట్ ప్రభు పార్టీ మూవీని తెరకెక్కించారు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 7:30 PM GMT
GOAT డైరెక్టర్ మరో మూవీ.. అప్పుడెప్పుడో షూట్ అయినా..
X

మంచి ముహుర్తంలో 2017లో మూవీ షూటింగ్ మొదలుపెట్టారు.. 2019లో కంప్లీట్ చేశారు.. కానీ ఇంకా ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు.. ఇన్నేళ్లకు ఇప్పుడు ఆ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఆ సినిమానే 'పార్టీ'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఆ చిత్రం.. 2024 లోపు విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలో ఎవరు నటించారు? ఎందుకు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు? అసలేం జరిగింది?


సత్యరాజ్, రమ్యకృష్ణ, నివేత పేతురాజ్, రెజీనా కసాండ్రా, జయరాం, శ్యామ్, నాజర్ ముఖ్య పాత్రల్లో డైరెక్టర్ వెంకట్ ప్రభు పార్టీ మూవీని తెరకెక్కించారు. రెండేళ్లలో షూటింగ్ ను పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఇప్పటికే పలు మార్లు విడుదల చేస్తామని అనౌన్స్ చేసినా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఆ సినిమాకు మోక్షం కలిగినట్లు ఉంది! త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు టాక్ వస్తోంది.

అయితే ఇన్నేళ్ల పాటు రిలీజ్ కాకపోవడం వెనుక పెద్ద రీజనే ఉంది. పార్టీ మూవీని ఫిజి ద్వీపంలో షూట్ చేశారు మేకర్స్. అప్పట్లో ఒక వెసులు బాటు ఉండేది. అదేంటంటే? ఫిజిలో షూట్ చేస్తే అక్కడి ప్రభుత్వం 47 శాతం సబ్సిడీ ఇస్తుంది. దీంతో మేకర్స్ మూవీ అంతా అక్కడే చిత్రీకరణ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత సీన్ ఒక్కసారి రివర్స్ అయింది. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించడంతో పర్యాటకం బాగా దెబ్బతింది. దీంతో ఫిజి సబ్సిడీ ఇవ్వడాన్ని నిలిపివేసింది.

ఇక అగ్రిమెంట్ లో రిలీజ్ ముందే సబ్సిడీ పొందాలనే రూల్ ఉండడంతో మూవీని ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు మేకర్స్. తాజాగా ఫిజి సర్కార్.. సబ్సిడీ లైన్ క్లియర్ చేసేందుకు ముందుకు వచ్చింది. శరవేగంగా కంప్లీట్ చేస్తుంది. దీంతో మేకర్స్.. మూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారీ క్యాస్టింగ్ తో ఉన్న పార్టీ మూవీ.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారని టాక్.

అయితే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్) సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో మూవీకి వస్తున్న క్రేజ్ ను యూజ్ చేసుకుని.. డిసెంబర్ లోపల పార్టీ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు వెంకట్ ప్రభు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో? ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.