Begin typing your search above and press return to search.

చైతన్య కస్టడీ.. ఇంకా లాగుతున్న దర్శకుడు..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన సినిమా కస్టడీ.

By:  Tupaki Desk   |   23 Dec 2024 9:45 AM GMT
చైతన్య కస్టడీ.. ఇంకా లాగుతున్న దర్శకుడు..!
X

తమిళ దర్శకులతో తెలుగు హీరోలు పనిచేయడం కామనే. ఇలా వెరైటీ కాంబోలో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ అయినవి కొన్ని ఉంటే అంచనాలను అందుకోలేని ప్రాజెక్ట్ లు మరికొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో నాగ చైతన్య కస్టడీ సినిమా వస్తుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన సినిమా కస్టడీ. ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు ఉండగా సినిమా రిలీజై అంతకంత డిజాస్టర్ గా నిలిచింది.

చైతన్య కస్టడీ సినిమా విషయంలో దర్శకుడిని బాగా టార్గెట్ చేస్తూ తెలుగు ఆడియన్స్ ట్రోల్స్ చేశారు. ఆ కోపంతోనే అప్పుడప్పుడు వెంకట్ ప్రభు కూడా తెలుగు ఆడియన్స్ మీద కాస్త ఫైర్ అవుతుంటాడు. ఇదిలా ఉంటే కస్టడీ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన వెంకట్ ప్రభు అసలు సినిమాలు అనుకున్న కథ అది కాదని కొత్త టర్న్ తీసుకున్నారు. సినిమా కథ అది కాదా ఇదేం ట్విస్ట్ అని ఆశ్చర్యపోవడం ఆడియన్స్ వంతు అయ్యింది.

వెంకట్ ప్రభు కస్టడీ కథను వెనకబడిన కులానికి చెందిన కానిస్టేబుల్ క్రిమినల్ ని పట్టుకుంటాడు. ఐతే అతన్ని పట్టుకున్నాక ఆ క్రిమినల్ కూడా తన కులపోడే అని తెలుస్తుంది. ఐతే ఆ టైం లో అతన్ని వదిలేయాలని సొంత కుల సంఘాల ఒత్తిడి.. మరోపక్క డ్యూటీకి కట్టుబడి నేరస్థుడిని కోర్టుకి తీసుకెళ్లాలా ఇలా మధ్యలో ఇరుక్కున్న హీరో కథ కస్టడీగా చేయాలని అనుకున్నారట. కానీ తెలుగులో ఇలాంటి కథ తీస్తే వర్క్ అవుట్ కాదని ఒక నిర్ణయానికి వచ్చి కథ మార్చేసి రాజకీయాలు, మాఫియా అంటూ కానిచ్చారు. ఐతే ఫస్ట్ అనుకున్న కథ తీస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో గెస్ చేయడం కష్టం.

కానీ కథ మార్చినా ఈ సినిమాకు హెల్ప్ అవ్వలేదు. కస్టడీ సినిమా చైతన్య కెరీర్లో ఫ్లాపైనా సరే ఎక్కువ చర్చ జరిగిన సినిమా. ఈ సినిమాతో ఒక ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. ఐతే వెంకట్ ప్రభు కూడా సినిమాను ప్రేక్షకులను మెప్పించడంలో తీయడంలో విఫలమయ్యారు. ఐతే హిట్ అయిన సినిమా గురించి చర్చ జరిపినా ఆసక్తికరంగా ఉంటుంది కానీ వెంకట్ ప్రభు కస్టడీ పోయిందని తెలిసినా ప్రతిసారి చర్చల్లోకి తెచ్చి అక్కినేని ఫ్యాన్స్ ని మరింత హర్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు.

ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.