బాలకృష్ణతో వెంకీ వయా అనీల్ రావిపుడి..!
విక్టరీ వెంకటేష్ తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఈ నెల 22న జరుగుతుందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 19 Dec 2024 5:21 AM GMTటాలీవుడ్ సీనియర్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేష్ లు ఒక వేదిక మీద కలిస్తే ఆ ఫ్రేమ్ చూడటానికి తెలుగు సినీ ప్రేక్షకులకు బాగుంటుంది. ఇలా మన స్టార్స్ ఒక స్టేజ్ మీద కనిపిస్తేనే సర్ ప్రైజ్ ఫీల్ అయ్యే మన ఆడియన్స్ ఇద్దరు కలిసి సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటే ఇంకాస్త ఖుషి అవుతారు. విక్టరీ వెంకటేష్ తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఈ నెల 22న జరుగుతుందని తెలుస్తుంది. టాలీవుడ్ నాలుగు స్థంబాలుగా చెప్పుకునే ఆ నలుగురిలో ఇద్దరు ఒకచోట చేరి ఇలా కబుర్లు చెప్పుకుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవని చెప్పొచ్చు.
బాలయ్య యాక్షన్ మాస్ హీరో.. ఇక మన వెంకీ మామ అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, ఎమోషనల్ సినిమాలు చేస్తుంటారు. వెంకటేష్ ఎమోషన్ సీన్ చేస్తే కన్నీరు రాని కళ్లు ఉండవు.. బరువెక్కని హృదయం ఉండదు. ఇద్దరు వారి వారి స్టైల్ లో ఫ్యాన్స్ ని అలరిస్తుంటారు. ఐతే ఈ ఇద్దరు చాలా తక్కువ సందర్భాల్లో కలుస్తుంటారు. ముఖ్యంగా సినిమాలు తప్ప మిగతా విషయాల్లో అసలు ఇన్వాల్వ్ అవ్వడు వెంకటేష్. కానీ బాలయ్య బాబు సినిమాలతో పాటు పాలిటిక్స్ ఇప్పుడు అన్ స్టాపబుల్ షోతో ఇలా డిజితల్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు.
బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే 3 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం నాలుగో సీజన్ జరుపుకుంటుంది. ఈ సీజన్ లో ఇప్పటికే చాలామంది స్టార్స్ వచ్చి షోని సక్సెస్ చేయగా త్వరలో విక్టరీ వెంకటేష్ కూడా షోకి వస్తున్నారని తెలుస్తుంది. వెంకటేష్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ స్పెషల్ చిట్ చాట్ జరుగుతుంది. అన్ స్టాపబుల్ షోలో వెంకటేష్ తో పాటుగా డైరెక్టర్ అనీల్ రావిపుడి కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.
సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా వస్తుంది. అదే సంక్రాంతికి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కూడా వస్తుంది. సినిమాల మధ్య పోటీ కామనే కాబట్టి దాన్ని ఆహ్వానిస్తూ అన్ స్టాపబుల్ షోలో ఆ సినిమాకు సంబందించిన విషయాలతో పాటు వెంకటేష్ తో బాలకృష్ణ చేసే చిట్ చాట్ పై సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వెంకటేష్ తో బాలయ్య చేసే ఈ సరదా సరదా ఫన్నీ అన్ స్టాపబుల్ చిట్ చాట్ ఎలా ప్రేక్షకులను రంజింపచేస్తుందో చూడాలి.