Begin typing your search above and press return to search.

ఆహా 'అన్ స్టాపబుల్ 4' - సంక్రాంతి హీరోలు వచ్చేశారు

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అన్‌స్టాపబుల్ విత్‌ బాలకృష్ణ సీజన్ 4 లో తాజా ఎపిసోడ్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

By:  Tupaki Desk   |   27 Dec 2024 6:30 PM GMT
ఆహా అన్ స్టాపబుల్ 4 - సంక్రాంతి హీరోలు వచ్చేశారు
X

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అన్‌స్టాపబుల్ విత్‌ బాలకృష్ణ సీజన్ 4 లో తాజా ఎపిసోడ్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈసారి స్పెషల్ గెస్ట్‌గా విక్టరీ వెంకటేష్‌ బాలకృష్ణతో కలిసి సందడి చేయడం విశేషం. బాలయ్య హోస్టింగ్ తో వెంకటేష్‌ నవ్వులు పూయించిన ఈ ఎపిసోడ్‌ ప్రస్తుతం ఆహా ఓటీటీలో ప్రసారం అవుతోంది.

ఈ ఎపిసోడ్‌ పై అప్డేట్ వచ్చినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా వారి సినిమాల విడుదలల గురించి బాలయ్య, వెంకీ సరదాగా మాట్లాడుకున్న సందర్భాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. బాలకృష్ణ డాకు మహరాజ్ తో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ చర్చల మధ్య ఇద్దరు లెజెండ్స్‌"పెళ్లి కాల వచ్చేసింది బాల" పాటకు డ్యాన్స్ కూడా చేశారు. షోలో వీరి డాన్స్‌ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ మూమెంట్స్ గట్టిగానే ఇచ్చారు. వెంకటేష్‌ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తన కుమార్తెలు, కుమారుడు అర్జున్‌ దగ్గుబాటి, మేనల్లుళ్లు రాణా దగ్గుబాటి, నాగ చైతన్య గురించి చెబుతూ, కుటుంబంపై ఉన్న ప్రేమను బయటపెట్టారు. సినిమాల్లోకి రావడానికి మొదటగా పెద్దగా ఆసక్తి లేని తన కలల ప్రపంచం గురించి చర్చించడంలో ఆత్మీయత కనిపించింది.

ఆయన దేశం విడిచి వ్యాపార రంగంలో స్థిరపడాలని కలలు కన్నారు, కానీ విధి ఆయన్ని తెలుగు సినిమా రంగంలోకి నడిపింది. ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకతను చేర్చుతూ వెంకటేష్‌ అన్న సురేష్‌ బాబు ఈ ఎపిసోడ్‌లో చేరారు. వారి చిన్నతనపు జ్ఞాపకాల్ని పంచుకుంటూ, వారి తండ్రి రామానాయుడి గురించి మనసును తాకే కధనాలను తెలిపారు.

ఆ క్షణాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేశాయి. అలాగే తల్లి, తండ్రుల పట్ల కృతజ్ఞతను తెలియజేసిన విధానం హైలెట్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ లో బాలకృష్ణ హోస్టింగ్, వెంకటేష్‌ చమత్కారాలు, సురేష్‌బాబు పంచుకున్న కుటుంబ జ్ఞాపకాలతో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ అనిపించింది. నవ్వులు, స్ఫూర్తి, భావోద్వేగాలతో నిండిన ఈ ఎపిసోడ్‌ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందిలని చెప్పవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఆహాలో ఈ అద్భుత ఎపిసోడ్‌ చూసేయండి.

https://www.aha.video/webepisode/unstoppable-s04-ep7