2027 సంక్రాంతి లాక్ చేసిన వెంకటేష్..!
ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్ ని పురస్కరించుకుని లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుక జరిగింది. ఈ వేడుకలో తన సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు వెంకటేష్.
By: Tupaki Desk | 11 Feb 2025 3:54 AM GMTసంక్రాంతికి రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫ్యామిలీ సినిమాతో 300 కోట్లు కలెక్షన్స్ తో అదరగొట్టాడు వెంకటేష్. తన మార్క్ సినిమా చేస్తే ఆడియన్స్ ఎలాంటి హిట్ అందిస్తారు అన్నది అర్థమైంది. ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్ ని పురస్కరించుకుని లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుక జరిగింది. ఈ వేడుకలో తన సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు వెంకటేష్.
నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో భోజనం టైంలో ప్రార్ధన చేసినట్టుగా దేవుడా ఓ మంచి దేవుడా అడక్కుండానే కలియుగ పాండవులు సినిమా ఇచ్చావు.. చంటి లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చావ్.. ప్రేమించుకుందాం రా, రాజా, తులసి, లక్ష్మి లాంటి సినిమాలు ఇచ్చావ్. 2000 లో బ్లాక్ బస్టర్ హిట్ కలిసుందాం రా ఇచ్చావ్. 2025 లో మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ ఇచ్చావ్ అని అన్నాడు. 5,10 ఏళ్లుగా సినిమా థియేటర్ కు వెళ్లని వారు కూడా ఈ సినిమా చూశారని తెలిసింది దానికి చాలా సంతోషమని అన్నారు వెంకటేష్.
ఇక ఈ క్రమంలో మళ్లీ 2027 సంక్రాంతికి వస్తామని చెప్పేశారు. సో వెంకటేష్ మళ్లీ 2027 సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నారు. అది అనిల్ రావిపూడి డైరెక్షన్ లోనే.. దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందా లేదా మరో బ్యానర్ సినిమా అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. వెంకటేష్ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో సంక్రాంతికి వస్తున్నాం రిజల్ట్ చూస్తే అర్ధమవుతుంది.
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల వసూళ్లను ఇది కలా నిజమా అని తెలియట్లేదని చెప్పడం ఈ సక్సెస్ ఆయనకు ఎంత జోష్ అందించింది అన్నది చెప్పొచ్చు. ఇన్నాళ్లుగా తనని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు తన స్పెషల్ థాంక్స్ చెప్పారు వెంకటేష్. వెంకటేష్ అనిల్ రావిపూడి 3 సినిమాలు చేస్తే 3 సక్సెస్ అందుకున్నాయి. హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా హిట్ తో వెంకీ మామ లో స్పెషల్ జోష్ కనిపిస్తుంది.ఇదే ఊపులో రాబోతున్న సినిమాలతో కూడా అదరగొట్టాలని దగ్గుబాటి ఫ్యాన్స్ కోరుతున్నారు.