Begin typing your search above and press return to search.

వెంకీ బాక్సాఫీస్: చంటి - కలిసుందాం రా - సంక్రాంతికి వస్తున్నాం

ఆ విధంగా టాలీవుడ్ స్టార్స్ లో మొదటిసారి 10, 25 కోట్ల గ్రాస్ అందుకున్న హీరో ఇతనే కావడం విశేషం.

By:  Tupaki Desk   |   1 Feb 2025 2:00 PM IST
వెంకీ బాక్సాఫీస్: చంటి - కలిసుందాం రా - సంక్రాంతికి వస్తున్నాం
X

టాలీవుడ్‌లో బాక్సాఫీస్ రికార్డులు ప్రతి దశలో కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నాయి. ఓ సమయంలో తెలుగు సినిమా 10 కోట్ల గ్రాస్ వసూలు చేయడమే గొప్పగా ఉండేది. ఆ తరువాత 25 కోట్లు అంటే మరో గొప్ప విషయం. కానీ ఇప్పుడు 1000 కోట్ల బిజినెస్‌ చేసే స్థాయికి ఎదిగింది. ఇక టాలీవుడ్ లో వెంకటేష్ కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. వెంకీ మాస్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఏక కాలంలో తనవైపు తిప్పుకోగల సమర్థుడు. ఆ విధంగా టాలీవుడ్ స్టార్స్ లో మొదటిసారి 10, 25 కోట్ల గ్రాస్ అందుకున్న హీరో ఇతనే కావడం విశేషం.

ఒకప్పుడు ‘చంటి’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మొదటిసారి 10 కోట్ల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించారు. 1992లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో 16 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బెస్ట్ హిట్స్ గా నిలిచింది. మాస్ సినిమాల డామినేషన్ పెరుగుతున్న సమయంలో వెంకీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ తో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.

అనంతరం ‘కలిసుందాం రా’ టాలీవుడ్ లోనే మొదటి 25 కోట్ల గ్రాస్ మార్కును అందుకుని ట్రెండ్ సెట్ చేసింది. 2000వ సంవత్సరంలో ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద టోటల్ గా 26 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ తోనే ఈ రేంజ్ సక్సెస్ వచ్చింది. అప్పటి బిగ్గెస్ట్ హిట్స్‌లో ‘జయం మనదేరా’ 104 కేంద్రాల్లో 50 రోజులు, ‘తులసి’ 225 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమయ్యాయి.

ఇప్పుడు ఈ లెవల్‌కు వెంకీ క్రేజ్ ఎంతలా ఎదిగిందో అర్థం చేసుకోవడానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రికార్డు చూస్తే సరిపోతుంది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ సీనియర్ హీరోల్లోనే ఇప్పటివరకు ఇంతటి కలెక్షన్లను సాధించిన సినిమా ఇదే. విడుదలైన రెండు వారాల్లోనే సినిమా 250 కోట్ల గ్రాస్‌ను దాటేసి, ఆ తరువాత 300 కోట్లకు చేరువైంది. వెంకటేష్ గత చిత్రాల రికార్డులను తుడిచిపెట్టేసి, సీనియర్ హీరోల్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచారు.

ఈ సినిమా విజయం వెంకటేష్ కెరీర్‌లో ఓ కొత్త దశను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలున్నాయి కానీ, 200 కోట్లను దాటిన సినిమా ఇదే. అలాగే 300 కోట్లు కూడా ఇదే సినిమాతో అందుకోవడం విశేషం. తెలుగు సినిమా మాస్ ఫాలోయింగ్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఒకే సమయంలో టార్గెట్ చేస్తే ఎంతటి భారీ కలెక్షన్లు వస్తాయో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రూవ్ చేసింది.

ఇంకా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియలేదు. బాక్సాఫీస్ దగ్గర ఇంకా సత్తా చాటే అవకాశం ఉంది. సీనియర్ హీరోల్లో ఇంతటి లాంగ్ రన్ అందుకున్న చిత్రం చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్‌దే. ఈ సినిమా భారీ లాభాలు తెచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వెంకటేష్ తన తర్వాతి సినిమాలను కూడా అదే ఊపుతో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రం విజయంతో పాటు, వెంకటేష్ మార్కెట్ స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లింది. ఇప్పటి వరకు సీనియర్ హీరోల సినిమాలు 150-180 కోట్ల వరకూ వచ్చాయి. కానీ 300 కోట్లకు చేరిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కావడం స్పెషల్. ఇకపై వెంకటేష్ సినిమాలకు మార్కెట్ భారీగా పెరిగేలా కనిపిస్తోంది.