సంక్రాంతికి వస్తున్నాం: రీజినల్ సినిమాల్లో నెంబర్ వన్ రికార్డ్
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని వర్గాల సినీ అభిమానులను ఆకట్టుకుంది.
By: Tupaki Desk | 20 Jan 2025 4:29 PM GMTసంక్రాంతి పండగను మరింత ఘనంగా మార్చిన విక్టరీ వెంకటేష్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లను బద్దలుకొడుతూ దూసుకెళ్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని వర్గాల సినీ అభిమానులను ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమా సాధించిన ఓ అరుదైన ఘనత తెలుగులో రీజినల్ సినిమాల చరిత్రలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఈ సినిమాతో ఫస్ట్ రీజినల్ తెలుగు సినిమా గా 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న అరుదైన ఘనత సాధించింది. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలు, బైలాంగ్యువల్ సినిమాలు ఈ స్థాయి గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం సులభం. కానీ కేవలం తెలుగు భాషలోనే విడుదలైన సినిమా ఇంతటి భారీ విజయాన్ని సాధించడం 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రత్యేకత. ఈ ఘనత వెంకటేష్ కెరీర్‌లోనే ఓ చరిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది.
అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా ఇప్పటివరకు 180 కోట్ల గ్రాస్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రం పాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని కలగలిపి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. దీంతో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు సంక్రాంతి వేళ వచ్చిన వెంకటేష్ సినిమా ఆ రికార్డ్‌ను జెట్ స్పీడ్‌తో బ్రేక్ చేసి 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. ఇది తెలుగు సినిమాకు మరో విశిష్టమైన ఘనతగా చెప్పుకోవచ్చు.
సంక్రాంతికి వచ్చిన సినిమాలు సాధారణంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం సర్వసాధారణం. కానీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంతకుమించిన విజయాన్ని అందుకుంది. వినోదం, కుటుంబ భావోద్వేగాలు, వెంకటేష్ కామెడీ, అనిల్ రావిపూడి హ్యూమర్ వంటి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. కేవలం ఓ రీజినల్ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ చారిత్రాత్మక ఘట్టం.
ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ఆదరణ కారణంగానే ఈ స్థాయి విజయాన్ని సాధ్యమైంది. సినిమాకు మంచి రిపీట్ ఆడియన్స్ ఉండటం, అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడం వల్ల ఈ ఘనత సాధించడానికి ముఖ్య కారణమయ్యాయి. తెలుగు సినిమాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డులను తిరగరాసింది.
వెంకటేష్ కెరీర్‌లో మాత్రమే కాకుండా, నిర్మాత దిల్ రాజుకి కూడా ఇది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం విజయంతో రీజినల్ సినిమాల స్థాయి మరింత పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట ఈ సినిమా ఫైనల్ రన్ లో 200 కోట్ల వరకు వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు బజ్ చూస్తుంటే లెక్క 300 కోట్లు దాటే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎన్ని రోజులు ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతుందో చూడాలి.