Begin typing your search above and press return to search.

రామానాయుడు చివరి రోజులు.. వెంకటేష్ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో వస్తున్న సూపర్ హిట్ టాక్ షో అన్ స్టాపబుల్. ఇప్పటికే 3 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు కొత్తగా నాలుగో సీజన్ కొనసాగిస్తున్నారు

By:  Tupaki Desk   |   24 Dec 2024 9:30 PM GMT
రామానాయుడు చివరి రోజులు.. వెంకటేష్ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు..?
X

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో వస్తున్న సూపర్ హిట్ టాక్ షో అన్ స్టాపబుల్. ఇప్పటికే 3 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు కొత్తగా నాలుగో సీజన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ లో స్టార్స్ చిట్ చాట్ తో ఆసక్తికరంగా మారగా లేటేస్ట్ గా ఈ షోకి విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సంక్రాంతికి బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు వస్తున్న సందర్భంగా ఈ ఇద్దరు కలిసి షోలో పాల్గొనడం క్రేజీగా మారింది. అంతేకాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ, వెంకటేష్ ల ప్రస్థానం గురించి తెలిసిందే. అందుకే ఈ ఇద్దరు కలయిక చాలా ప్రత్యేకంగా మారింది.

వెంకటేష్ తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ కాగా అందులో వెంకటేష్ తో బాలయ్య సరదా సంభాషణలు ఆసక్తికరంగా మారాయి. ఇక మరోపక్క వెంకటేష్ తన కూతుళ్లతో దిగిన ఫోటోను చూసి వారి గురించి చెప్పాడు. ఇక నాగ చైతన్య హగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ఇదే క్రమంలో వెంకటేష్ తో పాటుగా సురేష్ బాబు కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

సురేష్ బాబు వచ్చాక వెంకటేష్ రామా నాయుడిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. చివరి రోజుల్లో ఆయనతో ఉండాల్సింది. అలా చేయాల్సింది అంటూ వెంకటేష్ చాలా ఎమోషనల్ అయ్యాడు. దాదాపు వెంకటేష్ కళ్ల వెంట నీళ్లు వచ్చినట్టు అనిపించాయి. ఐతే రామా నాయుడి చివరి రోజుల్లో ఏం జరిగింది. వెంకటేష్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడు అన్నది ఎపిసోడ్ లో చూడాలి.

బాలకృష్ణ వెంకటేష్ అలా రెగ్యులర్ గా ఎక్కడో కలవడం వేరు. ఇలా ఒక స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొనడం మొదటిసారి అని చెప్పొచ్చు. బాలయ్య ఎనర్జీని మ్యాచ్ చేస్తూ వెంకటేష్ కూడా షోలో సరదాగా కనిపించారు. అనీల్ రావిపుడి కూడా ఈ షోలో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ అటు నందమూరి ఫ్యాన్స్ కి, ఇటు దగ్గుబాటి ఫ్యాన్స్ కి సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించనుంది. ఆహా అన్ స్టాపబుల్ షోలో వెంకటేష్ ఎపిసోడ్ ఈ నెల 27న రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ అవుతుంది.