Begin typing your search above and press return to search.

వెంకీ మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడా?

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ సినిమాలో నటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Nov 2024 5:30 PM GMT
వెంకీ మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడా?
X

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ సినిమాలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాబోయే సంక్రాంతి పండక్కి విడుద‌ల కానుంది. దీని తర్వాత వెంకీ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తారు? వంటి విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ మధ్య పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి కానీ, ఏదీ అధికారికంగా ధృవీకరించబడలేదు. అయితే ఇప్పుడు విమ‌ల్ కృష్ణతో వెంకీ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.

కెరీర్ ప్రారంభంలో యాక్టర్ గా కొన్ని సినిమాలు చేసిన విమ‌ల్ కృష్ణ‌.. 2022లో వచ్చిన ‘డీజే టిల్లు’ మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ ‘టిల్లు స్క్యేర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేయలేదు. ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటం వల్లనే విమ‌ల్ ‘డీజే టిల్లు 2’కి వర్క్ చేయలేకపోయాడని హీరో సిద్ధూ జొన్నలగడ్డ తెలిపారు. అప్ప‌టికే ఓ క‌థ రెడీ చేసుకున్న యువ దర్శకుడు.. పలువురు హీరోలలకు నేరేషన్ ఇచ్చాడట. అయితే అది చివ‌రికి వెంకటేష్ దగ్గరకు చేరిందని అంటున్నారు.

విమ‌ల్ కృష్ణ‌ చెప్పిన స్టోరీ నచ్చడంతో, వెంకీ అతనితో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘డీజే టిల్లు’ తరహాలోనే ఇదొక హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ అని టాక్ నడుస్తోంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయట. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో చిట్టూరి శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశం ఉందని అంటున్నారు. 2025 ప్రారంభంలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లి, అదే ఏడాది చివ‌ర్లో విడుద‌ల చేసే ఆలోచనలో ఉన్నారట. త్వలోనే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి, అన్ని వివరాలు వెల్లడిస్తారని వార్తలు వస్తున్నాయి.

వెంకటేష్ ఓవైపు వినోదభరితమైన కుటుంబ కథా చిత్రాలు చేస్తూనే, మరోవైపు యాక్షన్ ఎంటర్టైనర్స్ తో మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో తన ఏజ్ కు తగ్గ పాత్రలు ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో 'సైంధవ్' సినిమా చేసారు. ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం మరో యువ దర్శకుడు విమ‌ల్ కృష్ణ‌కు ఛాన్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

ఇదిలా ఉంటే, 2024 సంక్రాంతికి 'సైంధవ్' సినిమాతో వచ్చిన వెంకీ మామ.. 2025 ఫెస్టివల్ సీజన్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జనవరి 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది యాక్షన్‌ నేపథ్యంలో సాగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంట‌ర్‌టైన‌ర్. ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రల చుట్టూ తిరిగే కథతో రాబోతోంది. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో వెంకటేశ్ నుంచి 'రానా నాయుడు 2' వెబ్ సిరీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.