3 వేల మందితో వెంకీ మామ ఫ్యాన్స్ మీట్..
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టర్ వెంకటేష్.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 4 Jan 2025 9:45 AM GMTటాలీవుడ్ సీనియర్ హీరో విక్టర్ వెంకటేష్.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు.
ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఆ సినిమా.. జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్స్, పోస్టర్స్, గ్లింప్సెస్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. అదే సమయంలో మేకర్స్ చాలా కొత్తగా మూవీని ప్రమోట్ చేస్తున్నారు. అందరికీ సినిమా రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు.
వెంకటేష్ తాను ఓ సాంగ్ పాడతానని అనిల్ రావిపూడిని బతిమాలిన వీడియో, అరకులో పిల్లలతో వెంకీ వీడియో, ప్రెస్ మీట్స్, బుల్లితెర షోస్ లో ఎంటర్టైన్ చేయడం, వివిధ సందర్భాల్లో డ్యాన్స్ చేయడం.. ఇలా ఫుల్ ఎంటర్టైనింగ్ వీడియోస్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. న్యూఇయర్ సందర్భంగా కూడా స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసి ఆకట్టుకున్నారు.
అదే సమయంలో ఇప్పుడు వెంకటేష్.. రామానాయుడు స్టూడియోస్ లో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. నిజానికి ప్రతీ సంవత్సరం రామానాయుడు స్టూడియోలో ఫ్యాన్స్ ను కలవడం, వాళ్లకు ఫొటోలు ఇవ్వడం వెంకటేష్ చేస్తూనే ఉంటారు.
ఆ క్రమంలో ఈఏడాది కూడా ఆయన శనివారం ఉదయం తన ఫ్యాన్స్ ను కలిశారు. దీంతో రామానాయుడు స్టూడియోస్ కు అభిమానులు తరలివచ్చారు. సుమారు మూడు వేల మంది వచ్చినట్లు సమాచారం. వాళ్ళలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది. అయితే వెంకటేష్.. అందరినీ పలకరిస్తూ.. ఓపిగ్గా పిక్స్ దిగారు. గేట్ నుంచి లోపలి వరకు పెద్ద క్యూ లైన్ లో జనాలు ఉండడం చూస్తుంటే వెంకటేష్ ఎంత ఓపిగ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేష్ అంటే ఇది అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ మీట్ తో సంక్రాంతికి వస్తున్నాం మూవీపై మరింత బజ్ క్రియేట్ అవుతందనే చెప్పాలి. ఏది ఏమైనా అభిమానులను ఎప్పుడూ కలుస్తుంది వేరు.. ఈసారి వేరు.. ఎందుకంటే మరో పది రోజుల్లో మూవీ రిలీజ్ కానుండడం.. సినిమాకు ఫ్యాన్స్ మీట్ ప్లస్ పాయింట్ గా మారనుంది.