Begin typing your search above and press return to search.

వెంకీ కూడా రెమ్యునరేషన్ పెంచుతాడా?

ప్రస్తుతం వెంకటేష్‌తో సమాన స్థాయిలో ఉన్న హీరోలు 25-30 కోట్ల వరకు తీసుకుంటున్న నేపథ్యంలో, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ కూడా తన రెమ్యూనరేషన్‌ను దాదాపు డబుల్ చేసే ఛాన్స్ ఉందని టాక్.

By:  Tupaki Desk   |   29 Jan 2025 12:30 PM
వెంకీ కూడా రెమ్యునరేషన్ పెంచుతాడా?
X

టాలీవుడ్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా దాదాపు 270 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో, వెంకటేష్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ భారీ విజయంతో వెంకటేష్ రెమ్యూనరేషన్ పెరుగుతుందా? అనే ప్రశ్న ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐటి రెయిడ్స్ గురించి ప్రశ్నించగా, వెంకటేష్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. “నేను పూర్తిగా వైట్ తీసుకుంటాను, బ్లాక్ అనే మాట నా జీవితంలోనే లేదు” అని చెప్పి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే చర్చ కూడా మొదలైంది.

ఇప్పటివరకు వెంకటేష్ సినిమాకు 10 నుంచి 12 కోట్ల వరకు తీసుకునే హీరో అనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు కాబట్టి, రెమ్యూనరేషన్ పెంచే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల విభాగంలో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లాలంటే రెమ్యూనరేషన్ కూడా పెరగాలి.

ప్రస్తుతం వెంకటేష్‌తో సమాన స్థాయిలో ఉన్న హీరోలు 25-30 కోట్ల వరకు తీసుకుంటున్న నేపథ్యంలో, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ కూడా తన రెమ్యూనరేషన్‌ను దాదాపు డబుల్ చేసే ఛాన్స్ ఉందని టాక్. సాధారణంగా వెంకటేష్ తన మార్కెట్‌ను బట్టి, నిర్మాతలకు ఎలాంటి భారం రాకుండా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఒకవేళ మాస్ సినిమా చేస్తే, డబ్బింగ్ హక్కులు, ఇతర డీల్‌ల ద్వారా మంచి ప్రాఫిట్ వస్తే, వెంకటేష్ కూడా 25 కోట్ల వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు.

ఇప్పటికే ఆయన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏ దర్శకుడితో, ఏ బ్యానర్‌లో ఉంటుందనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. బడ్జెట్‌ పరంగా చూస్తే, వెంకటేష్ సినిమాలు ఎక్కువగా 30 నుంచి 50 కోట్ల మధ్య ఉంటాయి. కానీ ప్రస్తుతం వచ్చిన హిట్‌ను క్యాష్ చేసుకుంటే, 100 కోట్ల రేంజ్ ప్రాజెక్ట్ కూడా చేసేందుకు వెనుకాడకుండా ముందుకెళ్లే అవకాశం ఉంది. పైగా వెంకటేష్ ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు, మాస్ ప్రేక్షకుల్లోనూ మంచి మార్కెట్‌ను పెంచుకున్నారు.

ఇకపోతే వెంకటేష్ లేటెస్ట్ హిట్ తరువాత పెద్ద బ్యానర్లు కూడా ఆయనతో సినిమాలు చేయాలని ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో కొంతమంది స్టార్ హీరోలు పాన్-ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో, వెంకటేష్ కూడా తన మార్కెట్‌ను విస్తరించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ విజయాన్ని వెంకటేష్ తన రేంజ్ పెంచడానికి ఎలా వాడుకుంటారో చూడాలి. ఇంతకీ సంక్రాంతికి వస్తున్నాం హిట్‌తో వెంకటేష్ రెమ్యూనరేషన్ పెరుగుతుందా? లేక బడ్జెట్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటారా? అనేది చూడాలి.