Begin typing your search above and press return to search.

బాబాయ్ అబ్బాయ్ సందడి చూస్తారా.. ఇప్పుడే ట్యూన్ చేయండి..!

ప్రస్తుతం రానా అమెజాన్ ప్రైం వీడియో కోసం రానా దగ్గుబాటి షో చేస్తున్నాడు. ఈ షోకి లేటెస్ట్ గా స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వచ్చారు.

By:  Tupaki Desk   |   11 Jan 2025 5:16 AM GMT
బాబాయ్ అబ్బాయ్ సందడి చూస్తారా.. ఇప్పుడే ట్యూన్ చేయండి..!
X

తెలుగు పరిశ్రమలో బాబాయ్ అబ్బాయ్ రిలేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్టార్ హీరోలు వారి సోదరుల తనయులతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటారు. బాబాయ్ అబ్బాయ్ కలయిక ఫ్యాన్స్ కి భలే థ్రిల్ కలిగిస్తుంది. బాబాయ్ అబ్బాయ్ అనగానే చాలా మంది స్టార్స్ గుర్తుకొస్తారు. అటు మెగా ఫ్యామిలీలో బాబాయ్ అబ్బాయ్ అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రాం చరణ్ గుర్తుకొస్తారు. వారిద్దరు ఒకరి మీద ఒకరిపై చూపించే ప్రేమ ఎలాంటిదో తెలిసిందే. ఈమధ్యనే గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో కూడా బాబాయ్ మీద అబ్బాయి.. అబ్బాయ్ మీద బాబాయ్ ప్రేమ ఎలాంటిదో చూపించారు.


ఇక నందమూరి ఫ్యామిలీలో కూడా బాబాయ్, అబ్బాయ్ ల హంగామా తెలిసిందే. బాలకృష్ణ, ఎన్టీఆర్ అలా కలిసి కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే. ఐతే ఇండస్ట్రీలో అలా బాబాయ్ అబ్బాయ్ కాంబో సర్ ప్రైజ్ చేస్తుంది. అదే దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా కలయిక. బాబాయ్ వెంకటేష్ లానే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు రానా దగ్గుబాటి. రానా వెంకటేష్ కలిసి చేసే సందడి ఒక రేంజ్ లో ఉంటుంది.

ప్రస్తుతం రానా అమెజాన్ ప్రైం వీడియో కోసం రానా దగ్గుబాటి షో చేస్తున్నాడు. ఈ షోకి లేటెస్ట్ గా స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వచ్చారు. సంక్రాంతి పండగకి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వస్తున్న వెంకటేష్ తో ఆ సినిమా టీం అంత కలిసి రానా షోకి వచ్చి సందడి చేశారు. సరిగ్గా సినిమా రిలీజ్ టైం కు అబ్బాయ్ షోకి వెళ్లి బాబాయ్ చేసే హంగామా సినిమాకు చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్ ప్రోమో ఆల్రెడీ సూపర్ బజ్ క్రియేట్ చేసింది.

వెంకటేష్ తో రానా దగ్గుబాటి స్పెషల్ చిట్ చాట్ దగ్గుబాటి ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయానికి వస్తే సినిమాను అనీల్ రావిపూడి డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. సినిమా కోసం బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం టీం సందడి చూస్తుంటే సినిమా సూపర్ హిట్ కొట్టేలా ఉంది.