Begin typing your search above and press return to search.

వెంకటేష్ పాడిన బ్లాక్ బస్టర్ పొంగల్.. ప్రోమో చూశారా?

సూపర్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్యాన్ బేస్ ఉన్న వెంకీ మూవీ.. సంక్రాంతికి రిలీజ్ కానుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   28 Dec 2024 5:15 PM GMT
వెంకటేష్ పాడిన బ్లాక్ బస్టర్ పొంగల్.. ప్రోమో చూశారా?
X

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు సంక్రాంతికి తన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సూపర్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్యాన్ బేస్ ఉన్న వెంకీ మూవీ.. సంక్రాంతికి రిలీజ్ కానుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు.. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండడంతో మరిన్ని అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీస్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో హిట్ కాంబో రిపీట్ అవుండడంతో సంక్రాంతి వస్తున్నాం మూవీ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. జనవరి 14వ తేదీన రిలీజ్ కానున్న ఆ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూపొందిస్తున్నారు.

అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే మేకర్స్ రెండు సాంగ్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గోదారి గట్టుపైన రామచిలకవే అంటూ సాగే ఫస్ట్ సింగిల్ వేరే లెవెల్ హిట్ అయింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల ఈ పాటను ఆలపించారు. దీంతో ఆయన ఎవర్ గ్రీన్ వాయిస్ కు అంతా ఫిదా అయ్యారు.

రమణ గోగుల పాడిన పాట దాదాపు 50 మిలియన్స్ పైగా వ్యూస్ సంపాదించుకుని దూసుకుపోతోంది. ఆ మీనూ సాంగ్ ను రిలీజ్ చేయగా.. అది కూడా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు థర్డ్ సింగిల్ ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో.. ఫన్నీ గా ఆకట్టుకుంది.

మూడో సాంగ్ ను ఎవరితో పాడించాలని ఆలోచనలో ఉన్న అనిల్ రావిపూడి ను వెంకటేష్ నేను పాడుతానని అనేక సార్లు రిక్వెస్ట్ చేస్తారు. చివరకు అనిల్ రావిపూడి వెంకీని పాడమని చెప్తారు. ఇప్పుడు వెంకటేష్ పాడిన ప్రోమో సాంగ్ రీసెంట్ గా మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం వైరల్ గా మారింది.

అయితే బ్లాక్ బస్టర్ పొంగల్ ప్రోమో సాంగ్ లో వెంకటేష్ ఎనర్జీ లెవెల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి. వెంకీ మామ పాట పాడితే ఇలా ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే పూర్తి సాంగ్ డిసెంబర్ 30వ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మరి వెంకీ మామ పాడిన ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.