Begin typing your search above and press return to search.

'సంక్రాంతికే కలుద్దాం'.. వెంకటేష్ మూవీ క్రేజీ అప్డేట్

దీంతో Venky Anil3 ప్రాజెక్ట్ పై అటు వెంకీ అభిమానుల్లో ఇటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   27 Oct 2024 5:16 PM GMT
సంక్రాంతికే కలుద్దాం.. వెంకటేష్ మూవీ క్రేజీ అప్డేట్
X

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి. ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. దీంతో Venky Anil3 ప్రాజెక్ట్ పై అటు వెంకీ అభిమానుల్లో ఇటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా.. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తైనట్లు మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నట్లు తెలిపారు. డబ్బింగ్ మొదలైనట్లు చెప్పారు.

"Venky Anil3 టీమ్ 90% షూటింగ్‌ ను పూర్తి చేసి, పెద్ద స్క్రీన్‌లపై మీ అందరినీ అలరించేందుకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటుంది" అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. దాంతోపాటు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్ జరుగుతున్నట్లుగా.. చిన్న వీడియో గ్లింప్స్ ను షేర్ చేశారు. అందులో వెంకటేష్ తో పాటు పిల్లలు కనిపిస్తున్నారు. అదే వీడియోను వెంకటేష్ కూడా షేర్ చేశారు.

సంక్రాంతి కలుద్దామని రాసుకొచ్చారు. దీంతో వెంకటేష్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంక్రాంతికి వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ రావడం ఫిక్స్ అయినట్లేనని నెటిజన్లు చెబుతున్నారు. వాస్తవానికి Venky Anil 3 ప్రాజెక్టును సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ పలుమార్లు తెలిపారు. కానీ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నారు.

దీంతో వెంకటేష్ మూవీ విడుదల వాయిదా పడుతుందని జోరుగా ప్రచారం జరిగింది. మేకర్స్ కూడా స్పందించకపోవడంతో అంతా నిజమేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు నేరుగా వెంకటేష్.. సంక్రాంతికి కలుద్దామని పోస్ట్ పెట్టారు. దాని బట్టి ఆయన మూవీకి లైన్ క్లియర్ అయినట్లే. ప్రస్తుతం వెంకీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతి వస్తున్నాం అనే టైటిల్ ను మూవీకి ఫిక్స్ చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అది నిజమో కాదో కొద్ది రోజుల్లో తెలియనుంది.