Begin typing your search above and press return to search.

మామ‌- అల్లుడుకి 2025 భ‌లే క‌లిసొచ్చిందే!

2025 మామ‌-అల్లుడి కెరీర్ లో గొప్ప ఏడాదిగా మిగిలిపోతుందా? జీవితాంతం గుర్తు పెట్టుకునే గొప్ప సంవ త్స‌ర‌మా? అంటే అవున‌నే అనాలి.

By:  Tupaki Desk   |   26 March 2025 8:51 AM
మామ‌- అల్లుడుకి 2025 భ‌లే క‌లిసొచ్చిందే!
X

2025 మామ‌-అల్లుడి కెరీర్ లో గొప్ప ఏడాదిగా మిగిలిపోతుందా? జీవితాంతం గుర్తు పెట్టుకునే గొప్ప సంవ త్స‌ర‌మా? అంటే అవున‌నే అనాలి. ఇంత‌కీ ఎవ‌రా మామా అల్లుడు. ఏంటి వారి ప్ర‌త్యేక‌త అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. వాళ్లే విక్ట‌రీ వెంక‌టేష్‌..అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య‌. విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించిన `సంక్రాంతికి వ‌స్తున్నాం` పండ‌గ సీజ‌న్లో రిలీజ్ అయి ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.

వెంకటేష్ కెరీర్ లోనే తొలి సెంచ‌రీ న‌మోదు చేయ‌డ‌మేగాకుండా ఆయ‌న్ని ఏకంగా 300 కోట్ల క్ల‌బ్ లో చేర్చింది. ఒక్క విజ‌యం తో ఏకంగా చిరంజీవి, బాల‌య్య, నాగార్జున లాంటి స్టార్ల‌నే వెంకీ వెన‌క్కి నెట్టేసారు. అప్ప‌టి వ‌ర‌కూ వెంకీ సినిమాలంటే 60-70 కోట్లు రావ‌డం కూడా క‌ష్టం ఉండేది. వెంక‌టేష్ తో సినిమా అంటే? మార్కెట్ ప‌రంగా ఎన్నో అంశాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వ‌చ్చేది.

కానీ ఒక్క విజయంతో వెంక‌టేష్ స్టార్ డ‌మ్ మూడింత‌లు రెట్టింపు అయింది. దీంతో ఆయ‌న పారితోషికం కూడా భారీగా పెరిగింది. ఇక అల్లు నాగాచైత‌న్య కూడా `తండేల్` తో 100 కోట్ల క్ల‌బ్ లో కి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ కి ముందే సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. చైత‌న్య తొలి పాన్ ఇండియా రిలీజ్ కావ‌డంతో? అత‌డు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూసాడు.

రిలీజ్ అనంత‌రం అత‌డి న‌మ్మకం నిల‌బ‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కూ చైత‌న్య చాలా సినిమాలు చేసాడు. కానీ ఏవీ 80 కోట్లు వ‌సూళ్లు దాటలేదు. `తండేల్` ఏకంగా 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు తేవ‌డంతో అత‌డి ఆనందానికి అవ‌ధుల్లేవ్. ఈ సినిమా విజ‌యం విష‌యంలో నాగార్జున ఎంత సంతోషంగా ఉన్నారు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అలా వెంకీ-చైత‌న్య 2025లో సెంచ‌రీలో న‌మోదు చేసారు.