ట్రెండింగ్ లో వెంకీ సాంగ్.. అలా కలిసొచ్చిందే..!
విక్టరీ వెంకటేష్ అనీల్ రావిపుడి హిట్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.
By: Tupaki Desk | 9 Dec 2024 2:00 AM GMTవిక్టరీ వెంకటేష్ అనీల్ రావిపుడి హిట్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కుతున్న గేం చేంజర్ సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది. ఐతే వెంకీ మామ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ తో వస్తున్నాడు. అనీల్ రావిపుడి సినిమా అంటే అన్ని అంశాలు ఉంటాయి సో అలానే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా ఆడియన్స్ ని మెప్పించేలా చేస్తున్నారు.
ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ గా గోదారి గట్టు మీద చందమామయ్యో సూపర్ హిట్ అయ్యింది. సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా వైరల్ గా మారింది. ఈ సాంగ్ లో ప్రత్యేక ఆకర్షణగా రమణ గోగుల వాయిస్ నిలిచింది. ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా తన వెస్ట్రన్ స్టైల్ మ్యూజిక్ తో శ్రోతలను అలరించిన రమణ గోగుల తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. ఐతే మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ముగించిన ఆయన్ను మళ్లీ ఇన్నాళ్లకు ఈ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.
గోదారి గట్టుమీద చందమామయ్య సాంగ్ కు రమణ గోగుల వాయిస్ సూపర్ ప్లస్ అయ్యింది. ఆయన పాడారు కాబట్టే ఇంత రీచ్ వచ్చిందా అంటే అవుననే చెప్పాలి. ఇక ఈ సాంగ్ లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ స్టెప్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ సినిమా కథ హ్యాపీగా పెళ్లై భార్యతో కలిసి జీవిస్తున్న వెంకటేష్ కు తన లవర్ మీనాక్షి చౌదరి తారసపడుతుంది. ఆమెతో అతను ఎలా నడుచుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసి ఏం చేసింది అన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తుంది.
ఫ్యామిలీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మన వెంకీ మామ చాలా కాలం తర్వాత మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. సంక్రాంతికి సినిమా అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తే తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది. ఈ విషయాన్ని అంతకుముందు చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యేలా ఉంది. ధమాకా హిట్ తో సత్తా చాటిన భీమ్స్ సిసిరోలియో బలగంతో కూడా మెప్పించాడు. మరి సంక్రాంతికి వస్తున్నాం తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.