Begin typing your search above and press return to search.

వామ్మో వెంకీ మామ... ఆ వార్తలు నిజమేనా?

సీనియర్‌ హీరో వెంకటేష్‌ చాలా కాలం తర్వాత సూపర్‌ హిట్‌ సొంతం చేసుకున్నారు. సోలో హీరోగా వెంకటేష్‌కి హిట్‌ పడి చాలా సంవత్సరాలు అవుతుంది.

By:  Tupaki Desk   |   11 March 2025 10:56 AM IST
వామ్మో వెంకీ మామ... ఆ వార్తలు నిజమేనా?
X

సీనియర్‌ హీరో వెంకటేష్‌ చాలా కాలం తర్వాత సూపర్‌ హిట్‌ సొంతం చేసుకున్నారు. సోలో హీరోగా వెంకటేష్‌కి హిట్‌ పడి చాలా సంవత్సరాలు అవుతుంది. వెంకటేష్ కెరీర్‌ ఖతం అయిందని, ఆయన యంగ్‌ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తే బాగుంటుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆ విమర్శలన్నింటికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సమాధానం ఇచ్చాడు. తనకు సరైన అవకాశం లభిస్తే దున్నేస్తా అని సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో నిరూపించాడు. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా తర్వాత వెంకటేష్ చేయబోతున్న సినిమా ఏంటి అనేది సహజంగానే ఆసక్తి నెలకొని ఉంటుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌ను చేసి సక్సెస్‌ దక్కించుకున్న వెంకటేష్ అదే జోనర్‌లో సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు. కానీ వెంకటేష్‌ మాత్రం ఈసారి యాక్షన్ జోనర్‌లో సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం అందుతోంది. వెంకటేష్ గత రెండు నెలల కాలంలో చాలా కథలు విన్నాడట. ముఖ్యంగా వెంకటేష్‌ తదుపరి సినిమా విషయంలో వి వి వినాయక్‌, సురేందర్‌ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో వెంకీతో లక్ష్మి సినిమాను తీసిన వినాయక్ ఇటీవల ఒక కథను వినిపించాడని వార్తలు వస్తున్నాయి. లక్ష్మి సినిమాకు సీక్వెల్‌గా వినాయక్ ఆ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

చాలా కాలం తర్వాత వినాయక్ నుంచి ఒక పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ సినిమా రానుందని, అందులో వెంకటేష్ హీరోగా నటించబోతున్నారు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ సినిమాపై ఎలాంటి క్లారిటీ రాలేదు. నల్లమలుపు బుజ్జి నిర్మాణంలో వెంకటేష్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్‌ అయిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో కిక్ దర్శకుడు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలోనూ వెంకటేష్ సినిమా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌తో సినిమా అనుకున్న సురేందర్‌ రెడ్డి ఆయనతో వీలు పడక పోవడంతో అదే కథను వెంకటేష్ వద్దకు తీసుకు వెళ్లాడని, వెంకీ నుంచి గ్రీన్ సిగ్నల్‌ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

ఈ ఇద్దరు దర్శకులు ఒకప్పుడు సూపర్‌ హిట్‌ సినిమాలను అందించారు అనడంలో సందేహం లేదు, ఆ సమయంలో వీరు తోపు దర్శకులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఈ ఇద్దరు దర్శకులు హిట్‌ బొమ్మ తీయగలరు అనే నమ్మకం ప్రేక్షకుల్లో లేదు. ఇండస్ట్రీలోనూ వీరిపై పెద్దగా నమ్మకం పెట్టడం లేదు. అందుకే వీరికి పెద్దగా ఆఫర్లు రావడం లేదని టాక్‌. ఇలాంటి ఇద్దరు సీనియర్‌ దర్శకులతో సినిమాకి వెంకటేష్ ఓకే చెప్పాడంటూ వస్తున్న వార్తలు ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా వారు బాబోయ్ వెంకీ మామ ఇది నిజమేనా అంటూ చాలా మంది వెంకటేష్‌ను ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యి రెండు నెలలు కావస్తున్నా కొత్త సినిమాపై వెంకీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. కనుక ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు వెంకీ తన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడో చూడాలి.