రానా నాయుడు 2 లో అవి రిపీట్ కావు
మొదటి 9 రోజుల్లో రూ.230 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి మీడియా ముందుకు వచ్చారు.
By: Tupaki Desk | 23 Jan 2025 10:57 AM GMTవెంకటేష్ హీరోగా రూపొంది మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి 9 రోజుల్లో రూ.230 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి మీడియా ముందుకు వచ్చారు. సినిమాలో బుల్లిరాజు పాత్రకు మంచి స్పందన వచ్చింది అన్నారు. బుల్లి రాజు పాత్రతో తాము పిల్లలను ఓటీటీకి దూరంగా ఉంచమని సందేశం ఇచ్చామని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ఓటీటీల వల్ల పిల్లలు పాడవుతున్నారు, పెద్దొళ్లు కాస్త జాగ్రత్తగా ఉండమని మేము చెప్పాలని ఉద్దేశ్యంతో ఆ పాత్రను పెట్టామని అనిల్ చెప్పుకొచ్చారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పిల్లలపై వెబ్ సిరీస్‌ల ప్రభావం గురించి బుల్లిరాజుతో చెప్పే ప్రయత్నం చేశారు, మరీ మీరు నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్‌తో కిడ్స్‌ను పాడు చేశారు కదా అంటూ సక్సెస్ మీట్‌లో ఒక రిపోర్టర్ వెంకటేష్‌ని ప్రశ్నించాడు. అందుకు వెంకటేష్ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. తాను పిల్లలను ఏం పాడు చేయలేదు. నాకు అలా అనిపించలేదు అన్నారు. జనాలకు అనిపిస్తే నేను ఏం చేయలేను అన్నారు. ఈసారి రానా నాయుడు లో అవి కాస్త తక్కువ ఉండేలా చూసుకున్నాం. రానా నాయుడు సీజన్ 2 లో గత సీజన్‌తో పోల్చితే కాస్త తక్కువ బూతులు ఉంటాయి అన్నట్లుగా వెంకటేష్ చెప్పుకొచ్చారు.
వెంకటేష్‌ను ఫ్యామిలీ హీరోగా చాలా మంది అభిమానిస్తారు. అలాంటి ఫ్యామిలీ హీరో రానా నాయుడు వెబ్ సిరీస్ పేరుతో మరీ దారుణమైన భాషను వాడారు అని, ఆయనతో రానా నాయుడు మేకర్స్ చెప్పించిన డైలాగ్స్ మరీ దారుణంగా ఉన్నాయి అంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు. వెంకటేష్ సైతం ఆ విమర్శల పట్ల గతంలో సానుకూలంగా స్పందిస్తూ వెబ్ సిరీస్ కనుక అలాంటి కంటెంట్‌తో రావాల్సి వచ్చింది అన్నట్లుగా సమాధానం చెప్పారు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, వెంకటేష్ డైలాగ్స్ వైరల్ అయ్యాయి. దాంతో ఎప్పుడూ లేనిది వెంకటేష్ విమర్శలు ఎదుర్కొన్నారు.
రానా నాయుడు సీజన్ 1 విమర్శల నేపథ్యంలో రానా నాయుడు సీజన్ 2 కి జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే సీజన్ 2 షూటింగ్ పూర్తి చేశారు. అందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా జాగ్రత్త పడ్డట్లుగా తెలుస్తోంది. సీజన్ 1 కి తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అడల్ట్ కంటెంట్ వల్ల తెలుగు ఆడియన్స్ కాస్త దూరంగా ఉన్నారు. అయితే సీజన్ 2 లో ఆ సీన్స్ డైలాగ్స్ ఉండవ అని చెబుతున్నారు కనుక ఈసారి తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారేమో చూడాలి. రానా నాయుడు సీజన్ 2 ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.