Begin typing your search above and press return to search.

పుష్ప 2: సీనియర్ హీరో స్పెషల్ రివ్యూ.. అద్బుతం అంటూ..

ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   11 Dec 2024 12:07 PM GMT
పుష్ప 2: సీనియర్ హీరో స్పెషల్ రివ్యూ.. అద్బుతం అంటూ..
X

'పుష్ప-2: ది రూల్' దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న ఈ సమయంలో ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు. సినిమా విడుదలైన ప్రతి ఏరియాలోనూ రికార్డులు బద్దలవుతుండగా, స్టార్ నటులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ పుష్ప-2 విజయాన్ని సెలబ్రేట్ చేయడం విశేషం.

సుకుమార్ సరికొత్త మేకింగ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రేక్షకులను కొత్త అనుభవంలోకి తీసుకెళ్తున్నాయి. మరోవైపు, రష్మిక తన సహజ నటనతో ఈ కథకు కీలకమైన పిల్లర్ గా నిలిచింది. ఇక సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించడం విశేషంగా మారింది. తన ప్రత్యేకమైన నటనతో అల్లు అర్జున్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని వెంకటేశ్ ట్వీట్ చేశారు.

"అల్లు అర్జున్ ప్రదర్శన అద్భుతం, అతడి నటన స్క్రీన్ పై నా దృష్టిని మరల్చనివ్వలేదు. సుకుమార్ విజన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, రష్మిక నటనతో పాటు చిత్రయూనిట్ అందరి కృషి అద్భుతం," అని ట్వీట్ చేస్తూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. వెంకటేశ్‌ వంటి సీనియర్ స్టార్ నుంచి ఈ స్థాయి ప్రశంసలు రావడం పుష్ప-2 టీమ్‌కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికే 'పుష్ప-2' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

తొలివారంలోకి రాకముందే ఆరు రోజుల్లో 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. అంతే కాకుండా, తొలివారంలోనే హిందీ వర్షన్‌లో 350 కోట్లను దాటిన ఈ సినిమా, సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది. అల్లు అర్జున్ నటనపై ప్రత్యేకమైన ప్రశంసలు కురుస్తుండటంతో పాటు, సినిమా కథ, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెంకటేశ్ ట్వీట్ చేసిన తర్వాత పుష్ప అభిమానులు ఈ సినిమా సృష్టించిన రికార్డులను మరోసారి ప్రస్తావిస్తున్నారు.

సుకుమార్ తెరకెక్కించిన ఈ కథ కోలీవుడ్ మలయాళం ప్రేక్షకులను కూడా కట్టిపడేస్తూ, భారీ రెస్పాన్స్‌ను సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదలైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో అదిరిపోయే కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. అటు ఉత్తరాది ప్రేక్షకులను, ఇటు దక్షిణాది ప్రేక్షకులను ఒకే విధంగా ఆకర్షించిన పుష్ప-2, పాన్ ఇండియా స్థాయిలో అత్యుత్తమ విజయాన్ని అందుకుంది.