సంక్రాంతి హీరోలు.. వెంకీ మామ ఫుల్ డామినేషన్!
2025 సంక్రాంతికి తెలుగు స్ట్రయిట్ మూవీస్ గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 29 Dec 2024 4:03 PM GMT2025 సంక్రాంతికి తెలుగు స్ట్రయిట్ మూవీస్ గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అని పనులు పూర్తి చేసుకున్న మూడు చిత్రాలు.. రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. పొంగల్ స్పెషల్ గా ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించేందుకు గట్టిగా సిద్ధమవుతున్నాయి!
సంక్రాంతి బరిలో జనవరి 10వ తేదీన ముందుగా గేమ్ ఛేంజర్ తో థియేటర్లలోకి రానున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ.. డాకు మహారాజ్ తో జనవరి 12వ తేదీన రానున్నారు. విక్టరీ వెంకటేష్.. జనవరి 14వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సందడి చేయనున్నారు.
అయితే పొంగల్ కు ఇంకా కొద్ది రోజులే టైమ్ ఉండటంతో ఇప్పుడు ఆయా సినిమాల మేకర్స్.. ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఆడియన్స్ దృష్టిని తమ మూవీ వైపు తిప్పుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో వెంకటేష్.. ఇప్పుడు తన సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ దూసుకుపోతున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం మూవీకి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ తో గట్టిపోటీ ఉండనుంది. దీంతో వెంకటేష్ రంగంలోకి దిగి.. సినిమాపై వేరే లెవెల్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. బుల్లితెర షోలు, ఫన్నీ వీడియోలు సహా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. బజ్ ను ఇంకా పెంచుతున్నారు.
అలా సంక్రాంతి వస్తున్నాం మూవీ.. ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పొంగల్ సీజన్ లో ఆడియన్స్ కు బెస్ట్ ఆప్షన్ గా నిలిచేలా అనిపిస్తోంది. అయితే చాలా మంది సంక్రాంతి చిత్రాలన్నింటిని కూడా చూడాలనుకుంటారు. కానీ ప్రమోషన్స్ ద్వారా బజ్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి.
ఇక సంక్రాంతి వస్తున్నాం సినిమా విషయానికొస్తే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా రూపొందిన ఆ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.