Begin typing your search above and press return to search.

వెంకీ మామ ఈసారి గట్టిగానే..?

సైంధవ్ సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా అసలు టార్గెట్ మిస్ అవ్వకూడదని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు

By:  Tupaki Desk   |   14 Dec 2024 8:30 PM GMT
వెంకీ మామ ఈసారి గట్టిగానే..?
X

సైంధవ్ సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా అసలు టార్గెట్ మిస్ అవ్వకూడదని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు. తనకు ఆల్రెడీ F2, F3 సినిమాలతో హిట్లు అందించిన అనీల్ రావిపుడి డైరెక్షన్ లోనే సంక్రాంతికి వస్తున్నాం అంటూ వస్తున్నారు. ఐతే ఈ సినిమా మీద మొన్నటిదాకా పెద్దగా అంచనాలు లేవు. సంక్రాంతికి ఆల్రెడీ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ వస్తున్నాయి. వాటితో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది.

సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా వస్తే తప్పకుండా ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తారు. ఐతే వెంకటేష్ తో ఆల్రెడీ సంక్రాంతికే వచ్చి హిట్ కొట్టిన డైరెక్టర్ అనీల్ రావిపుడి ఈసారి పక్కా ప్లానింగ్ తో వస్తున్నారు. వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. గోదారి గట్టు మీద సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయ్యింది. ఆ పాటని ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగులతో పాడించడం కూడా కలిసి వచ్చింది. ఇక లేటెస్ట్ గా వెంకటేష్ బర్త్ డే సందర్భంగా రెండో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా సూపర్ అనిపించుకుంది. సంక్రాంతికి ఏదో ఫ్యామిలీ సినిమా తో వస్తున్నాడులే అనుకుంటే పొరబడినట్టే అవుతుంది.

వెంకీ మామ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ప్రేక్షకులు క్యూ కట్టేస్తారు. అసలే అనీల్ రావిపుడి అటు కామెడీ ఇటు సెంటిమెంట్ రెండిటి మీద మంచి పట్టు సాధించాడు. కాబట్టి వెంకటేష్ తో చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పక్కా హిట్ కొట్టే అవకాశం ఉంది. ఈ సినిమాకు భీమ్స్ ఇస్తున్న మ్యూజిక్ మేజర్ గా ప్లస్ అయ్యేలా ఉంది. సినిమాను దిల్ రాజు ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ తోనే తెరకెక్కిస్తున్నారు.

మరి వెంకటేష్ సినిమా సంక్రాంతికి వచ్చి సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఐతే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో గేమ్ ఛేంజర్ క్లాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా.. డాకు మహారాజ్ సినిమా ఊర మాస్ మూవీగా వస్తుంది. ఈ రెండిటి మధ్య కంప్లీట్ ఫ్యామిలీ మూవీగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తుంది. అందుకే ఈ సినిమా చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ మొదట ప్రిఫర్ చేస్తారు. ఇక సినిమా అనుకున్న రేంజ్ లో ఉంది అంతే మాత్రం ష్యూర్ షాట్ సంక్రాంతి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐతే సంక్రాంతి బరిలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారని తెలిసిందే.