Begin typing your search above and press return to search.

క్యూట్ భామలతో వెంకీ మాస్ ట్రీట్

ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి రంగురంగుల పండుగ తరహా సెట్స్‌లో మాస్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   23 Dec 2024 2:36 PM GMT
క్యూట్ భామలతో వెంకీ మాస్ ట్రీట్
X

సంక్రాంతికి ఈసారి టాలీవుడ్ లో అసలైన వైబ్ కనిపించబోతోంది. ముఖ్యంగా ప్రేక్షకులను మురిపించే క్రమంలో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి రంగురంగుల పండుగ తరహా సెట్స్‌లో మాస్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పోస్టర్ తాజాగా విడుదల చేశారు.

అందులో పల్లెటూరి వాతావరణం హైలెట్ అయ్యింది.

ఈ సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా రంగురంగుల సెట్‌ను నిర్మించి, సంక్రాంతి పండుగ జ్ఞాపకాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సిద్ధమైంది. బీమ్ సిసిరోలియో సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే “గోదారి గట్టు”, “మీనూ” లాంటి పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వీటిలో గోదారి గట్టు పాట గ్లోబల్ టాప్ 20 వీడియోల్లో స్థానం సంపాదించడం విశేషం.

వెంకటేష్‌ సంక్రాంతి టైమ్ లో ఏ సినిమాలతో వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయగలరు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆయన సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన గోదావరి ప్రాంతానికి చెందిన వినోదభరిత పాత్రలో కనిపించనున్నారు. వెంకీకి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కలిసి యంగ్ మరియు ఫ్రెష్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో “F2”, “F3” చిత్రాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్, వెంకటేష్‌తో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. దిల్ రాజు సమర్పణలో ఈ చిత్రాన్ని శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ నాడు జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పండుగ టైమ్ లో హంగామాను పెంచే కథ, పాటలు, కామెడీ, మాస్ యాక్షన్ సన్నివేశాలు కలిపి ప్రేక్షకులకు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించనున్నారు. ఈ చిత్రంపై బుక్ మై షోలో ఇప్పటికే 100Kకి పైగా ఇంట్రెస్ట్ రిజిస్టర్ కావడం విశేషం. ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అన్ని వర్గాల ఆడియెన్స్ మధ్య భారీ అంచనాలు పెరుగుతున్నాయి.

ఇక సినిమాలో మాస్ సాంగ్ మాత్రం మామూలుగా ఉండదని తెలుస్తోంది. సంక్రాంతి కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ సాంగ్ సినిమా విజయానికి మిగతా హైలైట్‌లతో పాటు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వెంకటేష్ ఎనర్జిటిక్ డ్యాన్స్, హీరోయిన్స్ గ్లామర్ మెరుపులు, భీమ్స్ బీట్స్ ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మాస్ ట్రీట్‌గా నిలవనుందని చెప్పవచ్చు.