వెంకీ మీనూ.. ఘర్షణ లుక్ లో సర్ ప్రైజ్
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 13 Dec 2024 5:22 AM GMTటాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన విడుదల కానుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
అయితే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. వారి కలయికలో ఇప్పటికే వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం మూవీతో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతుండడంతో అంతా మంచి అంచనాలు పెట్టుకున్నారు. హ్యాటిక్ విజయాన్ని సాధించాలని సినీ ప్రియులు, అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక అనిల్ రావిపూడి.. తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. పోస్టర్స్ తో సందడి చేస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు మీద రామచిలకవే సాంగ్ ను రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సీనియర్ సింగర్ రమణ గోగుల పాడిన ఆ పాట.. చార్ట్ బస్టర్ గా నిలిచింది
నేడు వెంకటేష్ పుట్టిన రోజు స్పెషల్ గా మేకర్స్ సెకెండ్ సింగిల్ మీనూ ప్రోమోను విడుదల చేశారు. సంక్రాంతికి వస్తున్నాం టీమ్ తరఫున బర్త్ డే విషెస్ తెలుపుతూ ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఆ ప్రోమో ఫుల్ గా ట్రెండ్ అవుతోంది. అందరినీ ఆకట్టుకుని సాంగ్ కోసం వెయిట్ చేసేలా ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేస్తోంది.
నా లైఫ్ లో ఉన్న ఆ ప్రేమ పేజీ.. అంటూ సాగుతున్న లిరికల్ సాంగ్ లో వెంకటేష్ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. ఘర్షణ స్టైల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కూడా కనిపించారు. ఇద్దరి మధ్య ప్రేమ గీతంతో తన గతాన్ని కూడా ఈ సాంగ్ లో హైలెట్ చేసినట్లు తెలుస్తోంది. మీనాక్షి చౌదరీ క్యూట్ గా ఉన్నారు. అనంత్ శ్రీరామ్ అద్భుతమైన లిరిక్స్ అందించినట్లు క్లియర్ గా తెలుస్తోంది. భీమ్స్ సిసిరోలియో ఛార్ట్ బస్టర్ అయ్యేలా మ్యూజిక్ అందించినట్లు అర్థమవుతోంది.
అయితే భీమ్స్ మ్యూజిక్ అందిస్తూనే గాత్రం కూడా అందించారు. ప్రణవి ఆచార్య కూడా గొంతు కలిపారు. విజువల్స్ కూల్ గా, రిచ్ గా కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రోమో.. పాటపై హైప్ క్రియేట్ చేస్తోంది. దిల్ రాజు సమర్పణలో భారీ స్థాయిలో శిరీష్ నిర్మిస్తున్న సంక్రాంతి వస్తున్నాం మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.