వెంకీ జెట్ స్పెస్ సాంగ్.. వ్వాటే టాలెంట్!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తన లేటెస్ట్ ప్రాజెక్ట్ కోసం సింగర్‌గా మారడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్.
By: Tupaki Desk | 28 Dec 2024 9:34 AM GMTటాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తన లేటెస్ట్ ప్రాజెక్ట్ కోసం సింగర్‌గా మారడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఐశ్వర్య లక్ష్మీ మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక వరుస అప్డేట్స్ తో మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఆల్బమ్‌లోని రెండు పాటలు భారీ విజయం సాధించాయి. గోదారి గట్టుమీద, మీను అనే రెండు పాటలు వినసొంపుగా ఉండడంతో వెంటనే వైరల్ అయ్యాయి. ఇక మరో మాస్ పాటను ఇప్పుడు వెంకటేష్ వాయిస్ ఓవర్ తో అందించబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన వీడియో కూడా బాగా ట్రెండ్ అయ్యింది. ఇక మూడవ పాట వెంకటేష్ గానంతో విజిల్స్ వేసేలా ఉంటుందట.
ఆ పాటను వెంకటేష్ కేవలం 20 నిమిషాల్లోనే పాడి అందరినీ ఆశ్చర్యపరిచారని తెలుస్తోంది. ఈ పాటలో వెంకీ గారి వాయిస్ కొత్తదనాన్ని తీసుకువచ్చిందని.. పాటకు ఆయన వాయిస్ సరిగ్గా సరిపోయిందని మ్యూజిక్ టీమ్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ పాటకు మరో కొత్త లేడీ సింగర్ తన వాయిస్ ఇచ్చింది. ఆమె వాయిస్ సాఫ్ట్‌గా, ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు. సంక్రాంతి నేపథ్యంలో రూపొందించిన ఈ పాట కుటుంబ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది.
పాట విడుదలకు ముందే సంగీత ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ ఎప్పుడూ పాత్రలలో కొత్తదనాన్ని చూపించడంలో ముందుంటారు. ఇప్పుడు సింగర్‌గా కూడా తన టాలెంట్‌ను ప్రదర్శించడం ఆయన మల్టీటాలెంటెడ్ ఇమేజ్‌ను మరింత బలపరిచింది. చివరగా వెంకీ గురు సినిమాలో ఒక పాట పాడిన విషయం తెలిసిందే. అది అప్పట్లో మంచి వైబ్ క్రియేట్ చేసింది.
ఇక సంక్రాంతి వస్తున్నాం.. సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. సినిమాలో వెంకీ ఎక్స్ కాప్ గా కనిపించబోతున్నారు. ఇక అతనికి భార్యగా ఐశ్వర్య లక్ష్మీ నటిస్తుండగా మీనాక్షి మరో పోలీస్ పాత్రలో కనిపించనుంది. వీరి ముగ్గురి మధ్య సాగే కథలో మంచి ఫ్యామిలీ ఏమోషన్ కామెడీ డ్రామా హైలెట్ అవుతుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా సంక్రాంతికి ఈ సినిమా బెస్ట్ ఫ్యామిలీ మూవీగా నిలుస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. మరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.