విక్టరీ @37 ఏళ్ల ప్రస్థానం
మూడున్నర దశాబ్ధాల ప్రయాణంలో ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. నేటి తో ( ఆగస్ట్14) ఆయన ప్రయాణం 37 ఏళ్లు పూర్తయింది.
By: Tupaki Desk | 14 Aug 2023 5:40 AM GMTమూవీ మొఘల్ రామానాయుడు వారసుడిగా తెరంగేట్రం చేసిన విక్టరీ వెంకటేష్ కెరీర జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అనుకోకుండా నటుడయ్యారు. ఆ తర్వత తెలుగు చనల చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. 'కలియుగ పాండవులు' నుంచి 'ఎఫ్-3' వరకూ ఆయన జర్నీ ఎంతో ఆసక్తికరం.
మూడున్నర దశాబ్ధాల ప్రయాణంలో ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. నేటి తో ( ఆగస్ట్14) ఆయన ప్రయాణం 37 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వెంకటేష్ జర్నీని ఓసారి స్మరించు కుంటే.. తండ్రి అగ్ర నిర్మాత అయినా ఆ ప్రభావం తనమీద ఏమాత్రం పడకుండా తనకు తానుగా పరిశ్రమలో ఎదిగారు. అప్పటికే పరిశ్రమలో తీవ్రమైన పోటీ ఉంది. ఎంతో మంది సీనియర్ల నుంచి పోటీని ఎదుర్కోవాలి.
కానీ ఆ నాడు వెంకటేష్ ముందవేమి కనిపించలేదు. అమెరికాలో ఉన్న వెంకటేష్ ని పిలించి తండ్రి వెంకటేష్ ని మ్యాకప్ వేసుకోమన్నారు. ఆయన కోరికే మేరకు వేసుకున్నారు. ఆ సంఘటన వెంకటేష్ జీవితాన్నే మార్చేసింది. కలియుగ పాండవులు భారీ విజయం సాధించడంతో ఎవరీ అబ్బాయ్ అని పరిశ్రమ సహా ప్రేక్షకులు ఆసక్తికరంగా ముచ్చటించుకున్నారు. తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆ అవార్డు వెంకటేష్ ని మరింత ఫోకస్ చేసేలా చేసింది.
ఇంతకాలం కుమారుడిని రామానాయుడు ఎక్కడ దాచేసాడంటూ సహచరలు చమత్కరించారు. ఆ తర్వాత వెంకటేష్ జర్నీలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి.' భారతంలో అర్జునుడు'..' శ్రీనివాస కళ్యాణం'.. 'రక్త తిలకం'.. 'స్వర్ణకమలం'..'వారసుడొచ్చాడు'..' ప్రేమ'...'ఒంటరి పోరాటం' లాంటి అప్పటి ఎరా సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ' బొబ్బిలి రాజా'...'చంటి' లాంటి ఫ్యామిలీ సినిమాలు చేసే సమయంలోనే 'సూర్య ఐపీఎస్' లాంటి యాక్షన్ అటెంప్ట్ చేసి తనలో కొత్త కోణాన్ని పరిచయం చేసారు.
'పొకిరి రాజా'..'ధర్మ చక్రం'..'గణేష్' లాంటి సినిమాలు వెకంటేష్ కి కొత్త రకమైన ఇమేజ్ ని తీసుకొచ్చాయి. వెంకేటష్ గా ఉన్న నటుడు విక్టరీ వెంకటేష్ గా బిరుదాంకితుడయ్యారు. అటుపై ట్రెండ్ కి తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ కొత్త తరం ప్రేక్షకుల్ని మెప్పించారు. కుటుంబ నేపథ్యంగల సినిమాలతో పాటు యాక్షన్ చిత్రాల్లోనూ తనదైన మార్క్ వేసారు. ఈ క్రమంలోనే తనదైన కామెడీ జానర్ పాత్రల్లోనే ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం 'సైంధశ్' అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేయనున్నారు. ఇదే వెంకీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.