పెద్దొడు కోసం చిన్నోడు ఎంత ప్రయత్నించాడంటే?
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో `సైంధవ్` తో 75 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రత్యేకంగా ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Dec 2023 6:12 AM GMTవిక్టరీ వెంకటేష్ కెరీర్ లో `సైంధవ్` తో 75 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రత్యేకంగా ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ జర్నీని గుర్తు చేసుకుంటూ ఈవెంట్ సాగింది. `కలియుగ పాండవలు టూ సైంధవ్ 75` అంటూ ఈవెంట్ తో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి..నేచురల్ స్టార్ నాని సహా కొంత మంది యంగ్ హీరోలు..స్టార్ డైరెక్టర్ల పాల్గొన్నారు.
ఇలా ఎంత మంది ఉన్నా? అక్కడ సూపర్ స్టార్ మహేష్ లేరు? అన్న ఓ వెలితి కనిపించింది. ఎందుకంటే మహేష్-వెంకటేష్ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయింది. మహేష్ కి వెంకటేష్ అంటే ఎంత ఇష్టమో చెప్పిన సందర్భాలెన్నో? టాలీవుడ్ లో వెంకటేష్ అంత ఇష్టం తనకి ఏ హీరో మీద ఉండదని పబ్లిక్ గానే మహేష్ చెప్పాడు.
ఆ మాటతో వెంకటేష్ ని ఎంతగా అభిమానిస్తాడు? అన్నది అందరికీ అర్ధమైంది. అంత అభిమానించే మహేష్ సైంధవ్ వేడుకకు ఎందుకు రాలేదు? అన్న చర్చ తెరపైకి రావడం సహజం. అయితే మహేష్ రావడానికి ఎంతగా ప్రయత్నారు అన్నది ఈ విషయం తెలిస్తే అర్దమవుతుంది. ఆ ఈవెంట్ జరిగే సమయంలో మహేష్ అన్నపూర్ణ స్టూడియో లో `గుంటూరు కారం` పాట షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారుట. జె ఈర్సీలో ఈవెంట్ 7 గంటలకు మొదలైంది. అప్పటి నుంచి మహేష్ పాట పూర్తి చేసుకుని రావాలని ఎంతో ప్రయత్నించారుట.
పాట షూట్ లో బిజీగా ఉన్న మధ్యలో మహేష్ హోస్ట్ లకు ఫోన్ చేసి అప్ డేట్ అడిగేవారుట. అలాచాలా సేపు మహేష్ పోన్ సంభాషణ నడిపారుట. కానీ గుంటూరు కారం పాట షూటింగ్ రాత్రి 10.30 కి పూర్త యిందిట. దీంతో అప్పుడైనా రావచ్చని మహేష్ అన్నపూర్ణ స్టూడియోస్ ని నుంచి హుటాహుటిన బయల్దేరడానికి రెడీ అయ్యారుట. కానీ ఆ సమయానికి ఈవెంట్ దాదాపు పూర్తికావడానికి సిద్దంగా ఉంది. అయినా సరే అంతా వెళ్లిపోయినా తాను ఒక్కడే వచ్చి వెంకటేష్ ని కలవాలని అనుకున్నారుట. కానీ మహేష్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రానా సహ పలువురు రావొద్దని..ఎలాంటి అసౌకర్యానికి పీల్ అవ్వొద్దని మహేష్ తో చెప్పినట్లు సమాచారం.