Begin typing your search above and press return to search.

వెంక‌టేష్ సేఫ్ గేమ్ సూపర్బ్!

విక్ట‌రీ వెంక‌టేష్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా? సీనియ‌ర్ల‌లో వెంకీ స్పెష‌లిస్ట్ గా చెప్పొచ్చా? అవుననే అనాలి.

By:  Tupaki Desk   |   8 Jun 2024 6:39 AM GMT
వెంక‌టేష్ సేఫ్ గేమ్ సూపర్బ్!
X

విక్ట‌రీ వెంక‌టేష్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా? సీనియ‌ర్ల‌లో వెంకీ స్పెష‌లిస్ట్ గా చెప్పొచ్చా? అవుననే అనాలి. వెంక‌టేష్ త‌రం హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ, నాగార్జున మాత్రం కేవ‌లం వెండి తెర‌కే ప‌రిమిమైతే..వెంకీ మాత్రం వెండి తెర‌తో పాటు ఓటీటీలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. థియేట‌ర్-ఓటీటీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే థియేట‌ర్లో సినిమా చూడ‌టానికి ప్రేక్ష‌కులు అంతగా ఆస‌క్తి చూపించ‌ని వైనం క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది.

డే బై డే థియేట‌ర్ల ఆద‌ర‌ణ త‌గ్గి..ఓటీటీ అద‌ర‌ణ అంత‌కంత‌కు పెరుగుతుంది. దీంతో వెంక‌టేష్ వెబ్ సిరీస్ ల్లోకి ఎంట‌ర్ అయ్యారు. తొలి సిరీస్ `రానా నాయుడు`ని అబ్బాయి రానాతో క‌లిసి చేసి గ్రాండ్ స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడ‌దే సిరీస్ కి రెండు..మూడు భాగాలు కూడా ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే అనీల్ రావిపూడితో కూడా వెంకీ కొత్త సినిమా మొద‌లైంది. `సంక్రాంతి వ‌స్తున్నాం` టైటిల్ తో సినిమా ప్ర‌క‌టించారు. ఇది వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

అదే ఏడాది మిడ్ లో `రానా నాయుడు-3` కూడా రిలీజ్ అవుతుంది. ఈ గ్యాప్ లో` రానా నాయుడు -2` ఓటీటీలో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఇలా వెంక‌టేష్ ప్రేక్ష‌కుల‌కు -త‌న‌కు మ‌ధ్య అంత‌రాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య‌లో మంచి క‌థ‌లొస్తే లాక్ చేసి పెడ‌తారు. గ‌త ప‌దేళ్ల‌గా వెంక‌టేష్ ఏదో సినిమాతో ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో ఉంటున్నారు. ఏడాదికి ఒక సినిమా అయినా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు.

ఓటీటీ ఆద‌ర‌ణ కూడా పెర‌గ‌డంతో! ఇక‌పై ఆ త‌ర‌హా కంటెంట్ పై ఎక్కువ‌గా దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. ఓటీటీ విజృంభ‌ణ‌ని..భ‌విష్య‌త్ సినిమా ఎలా ఉంటుంద‌న్న‌ది నిర్మాత సురేష్ బాబు ముందే అంచ‌నా వేసారు. ఆయ‌న నిర్మాణం త‌గ్గించ‌డానికి కారణాల్లో ఇదీ ఒక‌టి. ఈ విష‌యంలో వెంకీ అన్న‌య్య స‌ల‌హాలు కూడా తీసుకునే ముందుకెళ్తున్నట్లు క‌నిపిస్తుంది.