కెరీర్ వదిలేసి హిమాలయాలకు పోదామనుకున్నా!
విక్టరీ వెంకటేష్ కెరీర్ 'కలియుగ పాండవులు' నుంచి 'సైంధవ్' వరకూ దేదీప్యమానంగా సాగిపోయిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 28 Dec 2023 6:51 AM GMTవిక్టరీ వెంకటేష్ కెరీర్ 'కలియుగ పాండవులు' నుంచి 'సైంధవ్' వరకూ దేదీప్యమానంగా సాగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. 'సైంధవ్' సినిమా తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ చిత్రం. 75వ సినిమా కావడంతో దీన్ని పాన్ ఇండియాలోనే తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నా.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున నిర్వహించిన ఓ ప్రత్యేకమైన ఈవెంట్లో వెంకటేష్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకున్నారు. 'నేను ఇన్ని సినిమాలు చేస్తాననుకోలేదు. నాన్న బలమైన కోరిక. అన్నయ్య ప్రోత్సాహంతోనే హీరోనయ్యా. గురువు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'కలియుగ పాండవులు'తో నా ప్రయాణం మొదలైంది.
దాసరి నారాయణరావు...కె. విశ్శనాధ్ లాంటి అగ్ర దర్శకులతో కలిసి పనిచేయండ గొప్ప అను భవాన్నిచ్చింది. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేయగలిగాను. జయాపజయాలతో సంబంధం లేకుండా నన్ను ఆదరించారు. మొదట్లో విక్టరీ అనేవారు. తర్వాత రాజా అని పిలిచారు. కొన్నాళ్లు పెళ్లికాని ప్రసాద్ అన్నారు. తర్వాత పెద్దోడు..వెంకీ మామ ఇలా పిలిచారు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా పనిచేస్తున్నాను.
చాలాసార్లు కెరీర్ ని వదిలిపెట్టి వెళ్లిపోదాం అనుకునేవాడిని. అలా ఎందుకు అనిపించేదే తెలిసేది కాదు. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చేవారు. నా తోటి హీరోలైనా నాగార్జున..బాలకృష్ణ వీళ్లంతా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలు కొనసాగించా. కృషి.పట్టుదల..నిలకడతోనే విజయాలు సాధ్యమవుతాయి.హైరానా పడకుండా సహజంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఏదైనా రావాల్సిన సమయంలోనే వస్తుంది. పాజిటివ్ గా ఉండటం అలవాటు చేసుకోవాలి' అని అన్నారు.