వెంకటేష్ ఆ దేవతని ప్రియంగా పూజిస్తాడా?
ఎన్నిదేవుళ్లున్నా..ఎంత మంది దేవతలున్నా? అంతా సమానమే. కానీ ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకంగా పూజించే దేవుళ్లంటూ కొందరుంటారు
By: Tupaki Desk | 2 Jun 2024 10:30 AM GMTఎన్నిదేవుళ్లున్నా..ఎంత మంది దేవతలున్నా? అంతా సమానమే. కానీ ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకంగా పూజించే దేవుళ్లంటూ కొందరుంటారు. కొంతమంది వినాయకుడని..మరికొంత మంది అజనేయస్వామిని..ఇంకొంత మంది వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా నమ్మి పూజిస్తుంటారు. సెలబ్రిటీల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి అంజనేయ స్వామి భక్తుడు. ఆంజనేయ స్వామి జయంతిని ఆయన ఎంతో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే కోవలో తనయుడు రామ్ చరణ్ కి అంజనేయుడు అంటే ఎంతో ఇష్టం.
అలాగే అయ్యప్ప స్వామిని కూడా తల్లిదండ్రులిద్దరు కొలుస్తుంటారు. నితిన్ కూడా అంజనేయుడి భక్తుడే. పవన్ కళ్యాణ్ అయితే ఈ మద్య కాలంలో అన్నీ దేవుళ్లకు మెక్కుతున్నాడు. మరి విక్టరీ వెంకటేష్ ఏపార్టీ అంటే? ఇంతకాలం గోప్యంగా ఉన్నా! తాజాగా ఆయన సీక్రెట్ కూడా లీకైంది. వెంకటేష్ కి కలకత్తా కాళీ మాత అంటే ఎక్కువగా కొలుస్తుంటారుట. కాళీమాతకు గొప్ప భక్తుడు అని ఆయన మ్యాకప్ మెన్ రాఘవ తెలిపారు.
అప్పుడప్పుడు కాళీ మాత గుడికి వెళ్తుంటారుట. ఇంకా ఆయన గురించి మరిన్ని విషయాలు ఇలా పంచుకున్నారు. ` శత్రువు` సినిమా వచ్చిన సమయంలో వెంకటేశ్ గారు చాలా ఎగ్రెసివ్ గా ఉండేవారు. కానీ ఆ తరువాత ఏదో మిరాకిల్ జరిగినట్టుగా ఆయనలో ఒక అద్భుతమైన మార్పు రావడం నేను గమనించాను. సందర్భానికి తగినట్టుగా మాట్లాడటం , ఇతర విషయాలలో జోక్యం చేసుకోకపోవడం బాగుందనిపించింది. పెద్దగా టెన్షన్స్ తీసుకోరు. ఫోన్లు కూడా ఎక్కువగా ఉపయోగించరు.
సిగరెట్ గానీ , ముందుగాని అలవాటు లేదు. ఉంటే సినిమా సెట్స్ లో..లేదంటో ఇంట్లో ఉంటారు. రమణ మహర్షి పుస్తకాలు మాత్రం ఎక్కువగా చదువుతుంటారు` అని అన్నారు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా అనీల్ రావడిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకీ ల్యాండ్ మార్క్ చిత్రంగా రిలీజ్ అయిన `సైంధవ్` ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. దీంతో కొత్త సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నారు.