అంబానీ పెళ్లిలో వెంకీ మామ వైబ్స్
ఆయన తన సతీమణితో కలిసి పెళ్లి అనంతరం శుభ్ ఆశీర్వాద్ వేడుకకు విచ్చేశారు.
By: Tupaki Desk | 15 July 2024 2:45 AM GMTఅంబానీల పెళ్లిలో బిలియనీర్లు సందడి చేసారు. బాలీవుడ్, హాలీవుడ్ సహా అన్ని సినీపరిశ్రమల నుంచి స్టార్లు సందడి చేసారు. క్రీడాకారులు.. రాజకీయ నాయకులు.. పారిశ్రామికవేత్తలు.. వ్యాపారులు .. ఇలా అన్ని వర్గాలకు చెందిన సెలబ్రిటీలు అటెండయ్యారు.
ఇక తెలుగు చిత్రసీమ నుంచి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సూపర్‌స్టార్ మహేష్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి తదితరులు అటెండయ్యారు. వీరంతా ఎవరికి వారు యూనిక్ లుక్ తో వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. రాజమౌళితో సినిమా కోసం మహేష్ మేకోవర్ అంబానీ పెళ్లిలో రివీలైపోయింది. అయితే ఇదే పెళ్లిలో విక్టరీ వెంకటేష్ లుక్ కూడా ప్రధానంగా చర్చనీయాంశమైంది.
వెంకీ మామ నిజంగా స్టన్నింగ్ లుక్ తో ఆశ్చర్యపరిచారు. ఆయన తన సతీమణితో కలిసి పెళ్లి అనంతరం శుభ్ ఆశీర్వాద్ వేడుకకు విచ్చేశారు. బ్లాక్ కలర్ షేర్వాణీలో వెంకటేష్ ఎంతో ఛామింగ్ గా జెంటిల్మన్ అవతార్ లో కనిపించారు. ప్రస్తుతం దగ్గుబాటి అభిమానులు ఈ ఫోటోలను అంతర్జాలంలో వైరల్ గా షేర్ చేస్తున్నారు. వెంకీ మామ ఎక్కడ ఉన్నా పాజిటివ్ వైబ్స్ వెంట ఉంటాయి! అంటూ కీర్తిస్తున్నారు.
బాంబే టైమ్స్ షేర్ చేసిన ఇన్ స్టా పేజీలో వెంకటేష్ ఆయన సతీమణితో పాటు, అనన్య పాండే, అజయ్ దేవగన్, అలియా భట్, ఏక్తా కపూర్, జీతేంద్ర, తుషార్ కపూర్, సల్మాన్ ఖాన్, రవి కిషన్, సారా అలీఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, సునీల్ శెట్టి, మాధురీ దీక్షిత్ నీనే, డాక్టర్ నేనే అనంత్ తదితరులు కనిపించారు.