వెంకటేష్ మహా ఎగైన్ బ్యాక్..!
వెంకటేష్ మహా టాలెంట్ అందరికీ తెలిసినా అతను చేసిన ఆ కామెంట్స్ వల్ల అతను కొందరికి విరోధి అయ్యాడు.
By: Tupaki Desk | 23 Dec 2023 1:43 PM GMTకేరాఫ్ కంచెరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా సినిమాల పరంగా ఎంత టాలెంటో అందరికీ తెలిసిందే. అతను చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. అంతకుముందు వరకు అతని ప్రతిభను మెచ్చుకున్న వారే ఉన్నారు కానీ ఎప్పుడైతే అతను కె.జి.ఎఫ్ సినిమాను విమర్శిస్తూ కామెంట్ చేశాడో అప్పటి నుంచి అతన్ని కామెంట్ చేసే వారు ఏర్పడ్డారు. వెంకటేష్ మహా టాలెంట్ అందరికీ తెలిసినా అతను చేసిన ఆ కామెంట్స్ వల్ల అతను కొందరికి విరోధి అయ్యాడు.
లేటెస్ట్ గా డుంకీ సినిమా రిలీజ్ గురించి ఒక పోస్ట్ పెట్టాడు వెంకటేష్ మహా. అయితే నెక్స్ట్ డే సలార్ రిలీజ్ ఉంది కాబట్టే ప్రశాంత్ నీల్ సినిమాను పట్టించుకోకుండా డుంకీ గురించి ట్వీట్ చేశాడు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎటాక్ చేయడంతో వెంకటేష్ మహా ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేశాడు. సినిమాను విమర్శించడం మంచిదే కానీ అదేదో ఇంటెన్షనల్ గా చేయడం అన్నది కరెక్ట్ కాదు.
ఇదిలా ఉంటే వెంకటేష్ మహా మళ్లీ తిరిగి ట్విట్టర్ లోకి వచ్చాడు. తను డైరెక్ట్ చేసిన కేరాఫ్ కంచెరపాలెం సినిమా ఐ.డి.ఎం.బి టాప్ 250 రేటెడ్ మూవీస్ లో 14వ స్థానంలో నిలిచింది. ఆ ఇమేజ్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. అతను తిరిగి ట్విట్టర్ లో రావడం పట్ల అతనిపై మళ్లీ విరుచుకు పడేందుకు నెటిజన్లు సిద్ధమయ్యారు.
కె.జి.ఎఫ్ మీద వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ అతను ఒక ట్రోలింగ్ సబ్జెక్ట్ గా మారిపోయాడు. అతను ఏం చేసినా సరే దానిపై అతను ఊహించని విధంగా విమర్శలు వస్తున్నాయి. ఈమధ్య అతను నటుడిగా కూడా తెరంగేట్రం చేశాడు. కంచెరపాలెం డైరెక్టర్ గా వెంకటేష్ మహాకు ఒక మంచి గుర్తింపు ఉంది. అయితే తన సినిమాలేదో తను చేసుకోకుండా ఒక సూపర్ హిట్ అయిన సినిమాను తనకు నచ్చలేదు అన్నట్టు చెప్పకుండా విమర్శించడం ఆ సినిమా ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసింది. అప్పటి నుంచి వెంకటేష్ మహాపై నెటిజన్ల దాడి జరుగుతుంది. ఇది ఎప్పటికి ఫుల్ స్టాప్ పడుతుంది అన్నది తెలియాల్సి ఉంది.