Begin typing your search above and press return to search.

వెంక‌టేష్ కుమారుడు అమెరికాలో!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున వార‌స‌త్వం ఇప్ప‌టికే ఎంట్రీ ఇచ్చేసింది.

By:  Tupaki Desk   |   4 Jun 2024 12:30 AM GMT
వెంక‌టేష్ కుమారుడు అమెరికాలో!
X

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున వార‌స‌త్వం ఇప్ప‌టికే ఎంట్రీ ఇచ్చేసింది. చిరంజీవి వార‌సుడిగా రామ్ చ‌ర‌ణ్‌...నాగ్ వార‌సులుగా నాగచైత‌న్య‌..అఖిల్ లు తెరంగేట్రం చేసారు. రేపోమాపో న‌ట‌సింహ బాల‌కృష్ణ వార‌స‌త్వం కూడా దిగిపోతుంది. మోక్ష‌జ్ఞ ఏక్ష‌ణ‌మైనా కెమెరా ముందుకొచ్చే అవ‌కాశం ఉంది. మ‌రి విక్ట‌రీ వెంక‌టేష్ వార‌స‌త్వం సంగ‌తేంటి? అంటే ఆయ‌న కుమారుడు కూడా రెడీగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.

చాలా కాలం క్రితం వెంక‌టేష్ హీరోగా న‌టించిన `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` ఆడియో కార్య‌క్ర‌మంలో వెంకీ కుమారుడు అర్జున్ క‌నిపించాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఏ కెమ‌రాకి అర్జున్ చిక్కింది లేదు. హైద‌రాబాద్ లో ఉంటే ఒక్క‌సారైనా అత‌డి ఫోటోలు లీక్ అవుతాయి? కానీ అందుకు స్కోప్ లేకుండా చేసేసారు వెంక‌టేష్‌. కుమారుడిని అమెరికా పంపించి అక్క‌డే చ‌దివిస్తున్న‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఈ విష‌యాన్ని వెంక‌టేష్ మ్యాక‌ప్ మెన్ రాఘ‌వ రివీల్ చేసాడు. అర్జున్ అమెరికాలో ఉండి చ‌దువుకుంటున్నాడని, ప్ర‌స్తుతానికి సినిమా ఆలోచ‌న‌లైతే లేవ‌ని, త‌ర్వాత ఎలా ఉంటుందో చెప్ప‌లేమ‌ని అన్నాడు. అర్జున్ ఇప్పుడు హీరో వ‌య‌సుకు వ‌చ్చేసే ఉంటాడు. అత‌డిప్పుడు టీనేజ్ దాటిపోయే ఉంటాడు. కాలేజీ చ‌దువుల కోస‌మే అమెరికా పంపిన‌ట్లు తెలుస్తోంది. అమెరికా యూనివ‌ర్శిటీ నుంచి డిగ్రీ ప‌ట్టా వ‌చ్చిందంటే? చ‌దువు పూర్త‌యిన‌ట్లే.

న‌టుడిగా ఎంట్రీ ఇస్తాడా? లేదా? అన్న‌ది అర్జున్ ఇష్టంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. మూవీ మోఘ‌ల్ రామానాయుడు ఎంతో మంది న‌టీన‌టుల్ని వెండి తెర‌కు ప‌రిచ‌యం చేసారు. వెంక‌టేష్ ని కూడా ఆయ‌నే ప‌రిచ‌యం చేసారు. పెద్ద మ‌న‌వ‌డు రానా స‌క్సెస్ ని కూడా చూసారు. కానీ అర్జున్ ని ప‌రిచ‌యం చేసే అదృష్టం మాత్రం ఆయ‌న‌కు లేకుండా పోయింది.