చైతూను మోసం చేసిన వెంకట్ ప్రభు!
అయితే గతంలో తెలుగు హీరో నాగ చైతన్య తో మాత్రం ఎందుకు ఇలాంటి మంచి సినిమా తీయలేదు అంటూ దర్శకుడు వెంకట్ ప్రభు పై కొందరు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
By: Tupaki Desk | 22 Jun 2024 11:01 AMతమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇటీవల విడుదల అయిన టీజర్ సినిమా స్థాయి పెంచే విధంగా ఉంది. ముఖ్యంగా విజయ్ ని ఇందులో డబుల్ రోల్ లో చూడబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.
రెండు విభిన్నమైన ఏజ్ గ్రూప్ లో విజయ్ ని చూడబోతున్నట్లుగా ఇప్పటికే దర్శకుడు వెంకట్ ప్రభు హింట్ ఇచ్చాడు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాడు. ఆ తర్వాత సినిమాలు చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు. కనుక ఇదే ఆయన చివరి సినిమాగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో విజయ్ ను ది బెస్ట్ అన్నట్లుగా దర్శకుడు వెంకట్ ప్రభు చూపించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఇటీవల విడుదల అయిన టీజర్ లోనే కనిపిస్తున్నాయి. అయితే గతంలో తెలుగు హీరో నాగ చైతన్య తో మాత్రం ఎందుకు ఇలాంటి మంచి సినిమా తీయలేదు అంటూ దర్శకుడు వెంకట్ ప్రభు పై కొందరు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
వెంకట్ ప్రభు పై ఉన్న నమ్మకంతో అక్కినేని నాగ చైతన్య కస్టడీ సినిమా ను చేశాడు. ఆ సినిమా ఎంతటి డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సినిమా ను చైతూ ఎలా కమిట్ అయ్యాడు అంటూ చాలా మంది తెలుగు రివ్యూవర్స్ ముక్కున వేలు వేసుకున్నారు.
విజయ్ కి గోట్ వంటి అద్భుతమైన కథ ను ఇచ్చిన దర్శకుడు వెంకట్ ప్రభు మన తెలుగు హీరో కి మాత్రం చెత్త కథను కట్టబెట్టి మోసం చేశాడు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న చైతూ ఫ్యాన్స్ ని కూడా దర్శకుడు మోసం చేశాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.