Begin typing your search above and press return to search.

వెంకీ అట్లూరి - మరోసారి కోలీవుడ్ స్టార్?

అయితే ఈ సినిమాలతో వెంకీ సూపర్ హిట్స్ అందుకొని డైరెక్టర్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న కూడా తెలుగు హీరోలతో చేయడం లేదనే అపవాదు మూటకట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   15 Dec 2024 6:54 AM GMT
వెంకీ అట్లూరి - మరోసారి కోలీవుడ్ స్టార్?
X

‘తొలిప్రేమ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ అట్లూరి ఆ తరువాత అఖిల్ తో మిస్టర్ మజ్ను, నితిన్ తో రంగ్ దే సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. మొదటి మూడు సినిమాలలో ఒకే రకమైన లవ్ స్టోరీని కాస్తా అటు ఇటు మార్చి తెరపై చూపించాడనే విమర్శలు వెంకీ అట్లూరి ఎదుర్కొన్నాడు. ఇక మూడో సినిమాని వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో చేశాడు.

‘సార్’ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే 100 కోట్లకి పైగా కలెక్షన్స్ ని రెండు భాషలలో అందుకుంది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫియాని ఈ సినిమాలో వెంకీ అట్లూరి హైలైట్ చేశారు. ప్రేమకథని పూర్తిగా పక్కన పెట్టాడు. ఇక రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

బ్యాంకింగ్ సెక్టార్ లో జరిగే మోసాలని ఈ సినిమాలో వెంకీ అట్లూరి అందరికి అర్ధమయ్యే విధంగా చెప్పి మెప్పించాడు. అయితే ఈ సినిమాలతో వెంకీ సూపర్ హిట్స్ అందుకొని డైరెక్టర్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న కూడా తెలుగు హీరోలతో చేయడం లేదనే అపవాదు మూటకట్టుకున్నాడు. కానీ ఈ రెండు కథలు తెలుగు హీరోలు రిజక్ట్ చేసిన తర్వాత ధనుష్, దుల్కర్ తో చేశాడనే టాక్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయడం కోసం వెంకీ అట్లూరి సిద్ధం అవుతున్నాడంట. అతను మరెవరో కాదు, టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న సూర్య. ప్రస్తుతం సూర్యతో కథ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతోందంట. ఆల్ మోస్ట్ ఈ సినిమా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. ప్రెజెంట్ మార్కెట్ కి కరెక్ట్ గా యాప్ట్ అయ్యే కథని వెంకీ అట్లూరి సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

సూర్య రీసెంట్ గా ‘కంగువా’ మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా అతని ఇమేజ్ ని కూడా దెబ్బతీసింది. ప్రస్తుతం సూర్య కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కొత్త సినిమాని రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఒకవేళ వెంకీ అట్లూరితో మూవీ కన్ఫర్మ్ అయితే వచ్చే ఏడాది ఆఖరులో సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందని అనుకుంటున్నారు.