వెంకీ నెక్స్ట్ గురి ఎవరికి..?
తన సినిమా ఎప్పుడు మొదలు పెడతాడో.. ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు కానీ సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ ముందు మంచి ప్రమోషన్స్ చేసి సైలెంట్ గా హిట్ కొట్టి వెళ్తున్నాడు తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి.
By: Tupaki Desk | 1 Dec 2024 4:30 PM GMTతన సినిమా ఎప్పుడు మొదలు పెడతాడో.. ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు కానీ సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ ముందు మంచి ప్రమోషన్స్ చేసి సైలెంట్ గా హిట్ కొట్టి వెళ్తున్నాడు తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి. లాస్ట్ ఇయర్ ధనుష్ తో సార్ సినిమా చేసి హిట్ అందుకున్న వెంకీ అట్లూరి రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సార్ సినిమా అయినా పాటల వల్ల.. ధనుష్ క్రేజ్ వల్ల సెట్స్ మీద ఉన్నప్పుడు తెలిసింది కానీ లక్కీ భాస్కర్ ఏకంగా టీజర్ తోనే సర్ ప్రైజ్ చేశారు.
ఆల్రెడీ మహానటి, సీతారామం తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన దుల్కర్ హ్యాట్రిక్ సినిమాగా లక్కీ భాస్కర్ చేయగా సినిమా కూడా హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంది. వెంకీ అట్లూరి మార్క్ కథ కథనంతో లక్కీ భాస్కర్ సినిమాను టాప్ ప్లేస్ లో నిలబెట్టాడు. సార్, లక్కీ భాస్కర్ రెండు సూపర్ హిట్లతో వెంకీ అట్లూరి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.
ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏంటి.. హీరోగా ఎవరు చేస్తున్నారు అన్నది ఆసక్తికరమైన చర్చగా మారింది. సార్ తీసిన వెంటనే హిట్ పడటంతో అదే బ్యానర్ లోనే లక్కీ భాస్కర్ తీశారు. సో హిట్ పడింది కాబట్టి తన తర్వాత సినిమా కూడా అదే బ్యానర్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఐతే రొటీన్ కి భిన్నంగా కొత్త కథలతో కమర్షియల్ హిట్లు కొడుతున్నాడు వెంకీ అట్లూరి. కనిపించట్లేదు కానీ తనకంటూ ఒక సెపరేట్ మార్క్ ని క్రియేట్ చేసుకుంటున్నాడు.
ఐతే సార్, లక్కీ భాస్కర్ సినిమాల వల్ల అతని నెక్స్ట్ సినిమా మీద భారీ హైప్ ఉంటుంది. సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినప్పుడే అవి సర్ ప్రైజ్ చేస్తుంటాయి. ఐతే రెండు హిట్లు పడ్డాక డైరెక్టర్ చేసే సినిమా మీద ఆడియన్స్ గురి కచ్చితంగా ఉంటుంది. మరి వెంకీ నెక్స్ట్ గురి ఎవరి మీద పెడుతున్నాడు. అతను నెక్స్ట్ సినిమా కథ ఎలా ఉండబోతుంది లాంటి విషయాలు తెలియాల్సి ఉంది.
తన కథల మీద తెలుగు హీరోలు ఆసక్తిగా లేకపోవడం వల్లే తాను సార్ ధనుష్ తో, లక్కీ భాస్కర్ దుల్కర్ తో చేశానని చెప్పిన వెంకీ అట్లూరి ఆ సినిమాలను సూపర్ హిట్లుగా మలిచాడు కాబట్టి నెక్స్ట్ సినిమా అయినా తెలుగు స్టార్ ఛాన్స్ పొందుతాడా మళ్లీ బయటకు వెళ్తాడా అన్నది చూడాలి.