శిష్యుడిని గురూజీ అంత భయపెట్టేస్తే ఎలా!
అయితే నేను గురూజీ శిష్యుడినే అంటూ ఓ ఫేమస్ డైరెక్టర్ వెలుగులోకి రావడం విశేషం.
By: Tupaki Desk | 25 March 2025 1:13 PM ISTస్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ శిష్యులు ఎవరు? అన్నది ఇంత వరకూ పెద్దగా హైలైట్ అవ్వలేదు. గురూజీ వద్ద పనిచేసి బయటకొచ్చి డైరెక్టర్లగా ఫేమస్ అయింది కనిపించలేదు. చాలా మంది తమ గురువు ఎవరు? అంటే పూరి జగన్నాధ్ పేరో...సుకమార్ పేరో చెబుతారు తప్ప త్రివిక్రమ్..రాజమౌళి పేర్లు మాత్రం పెద్దగా ఎవరూ చెప్పరు. ఇండస్ట్రీలో ఇది సహజమే.
అయితే నేను గురూజీ శిష్యుడినే అంటూ ఓ ఫేమస్ డైరెక్టర్ వెలుగులోకి రావడం విశేషం. అతడే వెంకీ కుడుముల. `ఛలో` సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కి ఇంత వరకూ ఫెయిల్యూర్ లేదు. చేసిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. కొత్త కాన్సెప్ట్ తో పాటు దాన్ని కమర్శియలైజ్ చేయడంలో తన ట్యాలెంట్ చూపిస్తాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. 'రాబిన్ హుడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాడు.
అయితే ఇతడి కథల్లో..మాటల్లో కాస్త త్రివిక్రమ్ ప్లేవర్ కనిపిస్తుంది. అతడి ప్రభావం కొంత వరకూ ఉందని చాలా మందికి అనిపిస్తుంది. మరి ఇదెలా సాధ్యం అంటే? త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అఆ' సిని మాకి వెంకీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విషయాన్ని వెంకీ రివీల్ చేసాడు. ఆ సమయంలో త్రివిక్రమ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపాడు. అప్పటి నుంచి ఆయన తన గురువుగా మారా రన్నారు.
అప్పుడప్పుడు కలుస్తారట. అలా కలిసిన సమయంలో సినిమాలు ఎంత వరకూ వచ్చాయి? తప్ప కథల గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదుట. ఆయన దగ్గరకు వెళ్లాలంటే వెంకీకి కాళ్లు ఒణుకుతాయట. చిన్న ప్పుడు స్కూల్ టీచర్ దగ్గరకు హోంవర్క్ తీసెకెళ్లేటప్పుడు ఎలా భయపడతామో అదే భయం త్రివిక్రమ్ ని కలిసినప్పుడు కలుగుతుందన్నాడు. ఆయన ముందు కథ చెప్పాలంటే టెర్రర్ అన్నాడు.