నా సినిమాకు నేనే మొదటి విమర్శకుడిని: వెంకీ కుడుముల
భీష్మ తర్వాత వెంకీ ఎప్పుడెప్పుడు సినిమా చేస్తాడా అని అందరూ అనుకున్నారు. మధ్యలో పలు స్టార్ హీరోలను కూడా వెంకీ డైరెక్ట్ చేయనున్నాడని వార్తలొచ్చాయి.
By: Tupaki Desk | 12 March 2025 10:05 AM ISTఛలో సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకీ కుడముల మొదటి సినిమాతోనే మంచి డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత వెంకీకి వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ కొంచెం టైమ్ తీసుకుని నితిన్ తో భీష్మ మూవీ చేశాడు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడంతో డైరెక్టర్ గా వెంకీ స్థాయి మరింత పెరిగింది.
భీష్మ తర్వాత వెంకీ ఎప్పుడెప్పుడు సినిమా చేస్తాడా అని అందరూ అనుకున్నారు. మధ్యలో పలు స్టార్ హీరోలను కూడా వెంకీ డైరెక్ట్ చేయనున్నాడని వార్తలొచ్చాయి. కానీ అవేవీ వర్కవుట్ అవలేదు. భీష్మ మూవీ 2020లో వచ్చింది. అంటే వెంకీ నుంచి సినిమా వచ్చి ఆల్రెడీ ఐదేళ్లు పూర్తైపోయింది. సక్సెస్ అందుకున్నప్పటికీ వెంకీకి తర్వాతి సినిమా విషయంలో బాగా గ్యాప్ వచ్చింది.
ఇప్పుడు ఐదేళ్ల తర్వాత వెంకీ మరోసారి నితిన్ తో జత కట్టి రాబిన్‌హుడ్ సినిమాను తీశాడు. మార్చి 28న రాబిన్‌హుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ మంగళవారం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
రాబిన్‌హుడ్ సక్సెస్‌పై తాను చాలా నమ్మకంగా ఉన్నానని, బ్లాక్ బస్టర్ కొడుతున్నామని చెప్పాడు. తన సినిమాల విషయంలో తానే మొదటి క్రిటిక్ అని చెప్పిన వెంకీ, తాను అనుకున్న అవుట్‌పుట్ వచ్చే వరకు అసలు కాంప్రమైజ్ అవనని, పర్ఫెక్షన్ కోసం రీ వర్క్ చేస్తూనే ఉంటానని, ఈ విషయంలో హీరో కూడా తనకు చాలా సపోర్ట్ చేశాడని తెలిపాడు.
అద్భుతమైన కథకు ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసిన మూవీ రాబిన్‌హుడ్ అని, ఈ సినిమా హిట్ అయితే అది టీమ్ కష్టం వల్లేనని చెప్తున్న వెంకీ, ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాకపోతే మాత్రం దానికి బాధ్యుడు తానే అని, రాబిన్‌హుడ్ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతోనే తాను ఈ మాట చెప్తున్నట్టు వెంకీ చెప్పాడు. గతంలో వెంకీ- నితిన్ కాంబోలో వచ్చిన భీష్మ హిట్ అవడంతో ఇప్పుడు ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి.