Begin typing your search above and press return to search.

మెగా ఛాన్స్ ఆశలు వదుకోవాల్సిందే..!

ఈమధ్య స్టార్ హీరోలు కూడా యువ దర్శకులతో పనిచేయాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ యంగ్ టీం తో పనిచేసి వారి ఉత్సాహాన్ని తమలో నింపుకోవాలని చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 April 2025 3:57 AM
మెగా ఛాన్స్ ఆశలు వదుకోవాల్సిందే..!
X

ఈమధ్య స్టార్ హీరోలు కూడా యువ దర్శకులతో పనిచేయాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ యంగ్ టీం తో పనిచేసి వారి ఉత్సాహాన్ని తమలో నింపుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయ్యి సినిమాలు చేస్తుంటే మరికొన్ని జస్ట్ చర్చల దశల్లోనే ఆగిపోతున్నాయి. అలా ఫలానా దర్శకుడు ఫలానా స్టార్ హీరోతో సినిమా ఉంటుందని వార్తలు రాగా వారి మధ్య కథా చర్చలు సఫలం కాక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టుగా చెప్పుకుంటారు.

రీసెంట్ గా ఇది వెంకీ కుడుముల విషయంలో జరిగింది. ఛలో, భీష్మ సినిమాలు చూసిన తర్వాత చిరంజీవి వెంకీని పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. మంచి కథ ఉంటే చేసేద్దాం అన్నట్టుగా వారి మధ్య డిస్కషన్ జరిగింది. వెంకీ చెప్పిన లైన్ కి చిరు ఇంప్రెస్ అవ్వగా ఫైనల్ స్క్రిప్ట్ మాత్రం అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఐతే మెగాస్టార్ తో సినిమా అంటే అంత తేలికగా అయ్యే విషయం కాదు.

150 పైగా సినిమాల అనుభవం ఉన్న చిరంజీవి ఒక కథ వినగానే ఇది హిట్టా లేదా అన్న మాట చెప్పలగరు. అఫ్కోర్స్ కొన్ని సార్లు ఆయన అంచనాలు కూడా తప్పుతాయనుకోండి. ఐతే చిరంజీవి తో వెంకీ చేయాల్సిన సినిమా కథా చర్చల దగ్గరే ఆగిపోయింది. చిరుతో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు వెంకీ కుడుముల.

ఐతే చిరంజీవి సినిమా రాకపోయినా సరే నితిన్ తో రాబిన్ హుడ్ అంటూ ఒక సినిమా చేశాడు వెంకీ. రాబిన్ హుడ్ హిట్టు కొట్టి తన స్ట్రెంత్ ఏంటో చూపించాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాబిన్ హుడ్ కూడా అంచనాలను అందుకోలేదు. ఈ సినిమా హిట్టు కొట్టి చిరంజీవి ఆఫర్ కొట్టేద్దాం అనుకున్న వెంకీ కుడుములకు షాక్ తగిలినట్టు అయ్యింది.

అదేంటి హిట్టు డైరెక్టర్ కే చిరంజీవి ఛాన్స్ ఇస్తాడా లేకపోతే ఇవ్వడా అంటే మెగాస్టార్ ని సూపర్ ఎగ్జైట్ చేసే కథ అయితే ఒకవేళ ఒప్పుకునే ఛాన్స్ ఉంటుంది కానీ ఇలా హాఫ్ బేక్డ్ స్క్రిప్ట్ అయితే వెంకీ మరోసారి ప్రయత్నించినా లాభం ఉండదని చెప్పొచ్చు.

సో రాబిన్ హుడ్ హిట్టైతే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా వర్క్ అవుట్ కాకపోవడం వల్ల చిరు ఆఫర్ గురించి వెంకీ ఆలోచించడం కూడా వేస్ట్ అని చెప్పొచ్చు. చేతిదాకా వచ్చిన మెగాస్టార్ సినిమా ఛాన్స్ చేజార్చుకున్నాడు వెంకీ కుడుముల. మరి నెక్స్ట్ ఈ డైరెక్టర్ ఏం చేస్తాడన్నది చూడాలి.