Begin typing your search above and press return to search.

అలాంటి కథలే కావాలంటున్న వెంకటేష్..!

ఈమధ్య చాలా సినిమాలు పోస్టర్స్ లో బ్లాక్ బస్టర్ వేసుకుంటున్నా కూడా నిజమైన వసూళ్లు వేరేలా ఉంటున్నాయి.

By:  Tupaki Desk   |   20 Feb 2025 1:30 AM GMT
అలాంటి కథలే కావాలంటున్న వెంకటేష్..!
X

సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో తన ఇన్నేళ్ల కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టాడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సన్ర్కాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈమధ్య చాలా సినిమాలు పోస్టర్స్ లో బ్లాక్ బస్టర్ వేసుకుంటున్నా కూడా నిజమైన వసూళ్లు వేరేలా ఉంటున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం నికార్సైన హిట్ సినిమాగా చెబుతున్నారు.

ఇక ఈ హిట్ ఇచ్చిన కిక్ తో వెంకటేష్ తన ప్లానింగ్ అంతా మార్చేసినట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సైంధవ్ అంటూ ఒక కొత్త కథ యాక్షన్ మూవీతో వచ్చిన వెంకటేష్ కెరీర్ లో డిజాస్టర్ రిజల్ట్ మరోసారి చవిచూశాడు. ఐతే అనిల్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యి 300 కోట్లు వసూళ్లు రాబట్టడంతో ఇక మీదట అన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడట వెంకటేష్.

వెంకీ మామ ఈ నిర్ణయం తీసుకోవడం దగ్గుబాటి ఫ్యాన్స్ కే కాదు తెలుగు ఆడియన్స్ కి కూడా సూపర్ జోష్ ఇస్తుంది. కొంతమంది కొన్ని సినిమాలు చేస్తే చూసేందుకు చాలా బాగుంటుంది. అలాంటి సినిమాలు వారికి మాత్రమే అన్నట్టుగా ఉంటాయి. వెంకటేష్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎమోషనల్ మూవీస్ తోనే అలరిస్తాడు. ఈ విషయం మళ్లీ ప్రూవ్ అయ్యింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకటేష్ చేసే సినిమా కూడా ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు దర్శకులు చర్చల దశలో ఉన్నారు. వారిలో ఎవరు ఫైనల్ అన్నది త్వరలో తెలుస్తుంది. అంతేకాదు ప్రతి సంక్రాంతికి ఒక ఎంటర్టైనర్ సినిమాతో రావాలని ప్లాన్ చేస్తున్నాడట వెంకీ మామ. సో సంక్రాంతికి వస్తున్నాం తో ఒక క్లారిటీకి వచ్చిన వెంకటేష్ ఇక తన పంథాలో సినిమాలు చేసుకుంటూ వెళ్తాడని అంటున్నారు. మరి అవి ఏ కాంబోలో సెట్ అవుతాయి ఎలా ఉంటాయన్నది చూడాలి. అంతేకాదు మల్టీస్టారర్ సినిమాలకు కూడా వెంకటేష్ ఎప్పుడు రెడీ అంటాడు. సో వీటిలో మల్టీస్టారర్ సినిమా ఏదైనా ఉంటుందా అన్నది కూడా చూడాలి. ఐతే సంక్రాంతికే కాదు వెంకీ సినిమాలు ఎప్పుడొచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ బాట పట్టడం పక్కా అని చెప్పొచ్చు. ఈ హిట్ తో వెంకటేష్ కూడా సూపర్ జోష్ తో కనిపిస్తున్నాడు.