Begin typing your search above and press return to search.

అవ్వా తాతలుగా మారిపోయిన నితిన్, శ్రీలీల

రాబిన్‌హుడ్ 25 ఏళ్ల తర్వాత.. అంటూ వెంకీ కుడుముల పంచుకున్న ఈ వీడియోలో నితిన్ తెల్లగడ్డంతో ఓల్డ్ మ్యాన్ గెటప్ లో కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 July 2024 11:25 AM GMT
అవ్వా తాతలుగా మారిపోయిన నితిన్, శ్రీలీల
X

యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ''రాబిన్‌హుడ్‌''. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా దర్శకుడు వెంకీ ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రాబిన్‌హుడ్ 25 ఏళ్ల తర్వాత.. అంటూ వెంకీ కుడుముల పంచుకున్న ఈ వీడియోలో నితిన్ తెల్లగడ్డంతో ఓల్డ్ మ్యాన్ గెటప్ లో కనిపిస్తున్నారు. హీరోయిన్ శ్రీలీల కూడా ఏజ్డ్ పర్సన్ లా మేకప్ వేసుకొని కనిపించింది. అయితే ఆమె వయసు మీద పడిన తర్వాత ఎలా ఉంటుందో, ఇప్పుడు కూడా అలానే ఉందంటూ శ్రీలీలను వెంకీ ఆట పట్టించారు.

నితిన్, శ్రీలీల ఇద్దరినీ ఇలా అవ్వా తాతలుగా ఓల్డ్ ఏజ్ గెటప్ లోకి మార్చేసి వెంకీ ఏం ప్లాన్ చేస్తున్నారో అని నెటిజన్లు ఆరాలు తీసుకున్నారు. ఇది చాలా ఫన్నీగా క్యూట్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇవ్వమని ఓ అభిమాని అడగ్గా.. "కాస్తా ఓపిక పట్టండి. త్వరలోనే అప్డేట్ ఇస్తాం" అని దర్శకుడు బదులిచ్చారు. "ఏదో 'బాహుబలి 3' తీస్తున్నట్లు ఇంత టైమ్ తీసుకుంటున్నారు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా'' అని మరో ఫ్యాన్ అసహనం వ్యక్తం చేయగా.. "ఎవరి సినిమా వాళ్ళకి బాహుబలేగా" అని సమాధానమిచ్చారు వెంకీ.

'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ కుడుముల, నితిన్ క‌లిసి చేస్తున్న చిత్రం 'రాబిన్ హుడ్'. యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే డబ్బునోళ్ల దగ్గర దోచుకునే యువకుడిగా నితిన్ కనిపిస్తారు. అతని పాత్రకు పూర్తి భిన్నంగా నీరా వాసుదేవ్‌ అనే లేడీ బాస్ క్యారక్టర్ ను శ్రీలీల పోషిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ ఆడియన్స్ ను అకట్టుకున్నాయి. 2024 క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 20వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.