Begin typing your search above and press return to search.

ఇది వెంకటేష్‌ బ్లాక్ బస్టర్‌ పొంగల్‌

ఈ సినిమాను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారు. ఆ లక్ష్యం నెరవేరింది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   14 Jan 2025 6:25 PM GMT
ఇది వెంకటేష్‌ బ్లాక్ బస్టర్‌ పొంగల్‌
X

సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల్లో చివరగా వచ్చిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ దక్కింది. మరోసారి అనిల్ రావిపూడి చేసిన ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సూపర్‌ హిట్‌ టాక్‌ని తెచ్చి పెట్టింది. భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయే వ్యక్తి పాత్రలో వెంకటేష్ నటించాడు. ఇలాంటి పాత్రలు వెంకటేష్‌కి వెన్నతో పెట్టిన విధ్య. ఆయన తన మార్క్ మేనరిజంతో అద్భుతంగా సినిమాలో నటించి ప్రేక్షకులను నవ్వించాడు. ఈ సినిమాను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారు. ఆ లక్ష్యం నెరవేరింది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

సినిమాకి హిట్‌ టాక్‌ రావడంతో హీరో వెంకటేష్‌, హీరోయిన్స్‌ ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ మీడియా ముందుకు వచ్చారు. సినిమా హిట్‌ నేపథ్యంలో క్రాకర్స్ కాల్చి తమ సంతోషాన్ని పంచుకున్నారు. కేక్‌ కట్‌ చేసి తినిపించుకున్నారు. ఈ సంక్రాంతి విజేత సంక్రాంతికి వస్తున్నాం అని తేలిపోయింది అంటూ వీరి సెలబ్రేషన్స్‌ వీడియోలు, ఫోటోలను సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు. ఓ రేంజ్‌లో బ్లాక్‌ బస్టర్‌ పొంగల్‌ అంటూ ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి వెంకటేష్‌ గారిది. సినిమా కోసం ఆయన అందించిన ప్రోత్సాహం వల్లే ఈ స్థాయి విజయాన్ని సాధించాం. ఆయన ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకోగలరు అని మరోసారి నిరూపితం అయ్యింది. ఈ బ్లాక్ బస్టర్‌ పొంగల్‌ వెంకటేష్ గారికి అంకితం అన్నట్లుగా అనిల్‌ రావిపూడి మాట్లాడారు. ఆ తర్వాత వెంకటేష్ మాట్లాడుతూ.. మరోసారి అనిల్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా సినిమాని రూపొందించాడు. ఇది మా ఇద్దరి కాంబోకి మరో విజయాన్ని తెచ్చి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక సంపూర్ణమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులకు అందించాలని మేము చేసిన ప్రయత్నం కు మంచి స్పందన రావడం పట్ల సంతోషంను వ్యక్తం చేశారు.

నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ సక్సెస్‌ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ బ్యానర్‌కి మరో విజయాన్ని అందించినందుకు గాను అనిల్ రావిపూడికి నిర్మాతలు కృతజ్ఞతలు తెలియజేశారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో తన అన్‌స్టాపబుల్‌ హిట్‌ రికార్డ్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇదే జోరు చిరంజీవి సినిమాతో కంటిన్యూ కావాలని, వచ్చే సంక్రాంతికి చిరంజీవితో అనిల్‌ రావిపూడి ఇదే తరహా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. త్వరలోనే చిరు, అనిల్‌ రావిపూడి మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.