Begin typing your search above and press return to search.

వెన్నెల తింగరి ఏజెంట్‌ రాక కన్ఫర్మ్‌

కమెడియన్స్ హీరోగా సినిమాలు చేయడం కొత్తేం కాదు. టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా ప్రమోషన్‌ పొందారు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 9:04 AM GMT
వెన్నెల తింగరి ఏజెంట్‌ రాక కన్ఫర్మ్‌
X

కమెడియన్స్ హీరోగా సినిమాలు చేయడం కొత్తేం కాదు. టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా ప్రమోషన్‌ పొందారు. కొందరు కమెడియన్స్ హీరోలుగా సెటిల్ అవ్వగా కొందరు మాత్రం హీరోగా సక్సెస్ లు దక్కక పోవడంతో మళ్లీ కామెడీ చేస్తూ నవ్విస్తున్నారు.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా దూసుకు పోతున్న వెన్నెల కిషోర్‌ హీరోగా సినిమా చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం 'చారి 111' సినిమాను ప్రకటించారు. తాను కన్ఫ్యూజ్‌ అవుతూ ఇతరులను కన్ఫ్యూజ్‌ చేస్తూ తింగరి వేశాలు వేసే ఏజెంట్‌ కథతో ఈ సినిమాను రూపొందించారు.

ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌ లుక్ మరియు పాత్ర నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి అంటూ ఇప్పటికే విడుదల అయిన వీడియో తో తేలిపోయింది. వెన్నెల కిషోర్ కామెడీని ఇష్టపడే చాలా మంది ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

సైలెంట్ గా షూటింగ్ జరిపిన చారి 111 సినిమాను మార్చి 1న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. చాలా స్పీడ్ గా షూటింగ్‌ జరిపిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ చేస్తున్నారు. త్వరలో ఫస్ట్‌ కాపీ రెడీ అవ్వనుంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఒక వైపు స్టార్‌ హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ చాలా బిజీగా ఉన్న వెన్నెల కిషోర్‌ ఇలా హీరోగా సినిమాను చేసేందుకు ఓకే చెప్పడంను బట్టి చూస్తూ ఉంటే కచ్చితంగా ఆ కథలో కంటెంట్ ఉండి ఉంటుంది... ప్రేక్షకులను మరింతగా నవ్వించగలను అనే నమ్మకం వెన్నెల కిషోర్ కి ఉండి ఉంటుంది అంటూ ఆయన అభిమానులు నమ్ముతున్నారు