Begin typing your search above and press return to search.

దసరా లో కీర్తి.. బేబిలో వైష్ణవి..!

ఇప్పుడు వైష్ణవి ని కూడా కీర్తి సురేష్ తో పోలుస్తూ సోషల్ మీడియా లో ఆ రెండు వీడియోల ను వైరల్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 July 2023 8:17 AM GMT
దసరా లో కీర్తి.. బేబిలో వైష్ణవి..!
X

ఎన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నామ ని కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవడం లోనే సక్సెస్ ఉంటుంది అనేది మరోసారి బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యని చూస్తే అర్ధమవుతుంది. అంతకుముందు వెబ్ సీరీస్ లు చేస్తూ యూట్యూబ్ హీరోయిన్ గా చేస్తూ వచ్చిన వైష్ణవి చైతన్య బేబీ సినిమా తో సూపర్ హిట్ అందుకుంది. తొలి సినిమా తోనే ఆమె ఎంతో మెచ్యుర్డ్ గా నటించడం పట్ల సినీ విశ్లేషకులు కూడా ప్రశంసిస్తున్నారు. అయితే వైష్ణవికి ఆల్రెడీ యూట్యూబ్ సీరీస్ లో నటించిన అనుభవం ఉంది కాబట్టే బేబీ సినిమాలో అలా చేయగలిగిందని చెప్పొచ్చు.

అంతేకాదు ఇలాంటి పాత్రలో నటించాలన్నా సరే ఎంతో డేర్ ఉండాలి. ఆ విషయం లో కూడా వైష్ణవి గట్స్ ని చూసి మెచ్చుకోవాల్సిందే. బేబీ సినిమా లో వైష్ణవి క్యారెక్టర్ కి తను ఎంత న్యాయం చేసింది అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఒక దశలో వైష్ణవి ని మహానటి కీర్తి సురేష్ తో పోలుస్తున్నారు ఆడియన్స్. అదెలా అంటే బేబీ సినిమా లో వైష్ణవి బస్తీ గణేష్ ఉత్సవాల్లో ఒక డ్యాన్స్ వేస్తుంది. ఆ డ్యన్స్ చూసిన వారెవరైనా వైష్ణవి టాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందే.

అయితే దసరా సినిమా లో కీర్తి సురేష్ కూడా పెళ్లి బరాత్ డ్యాన్స్ లో అంతే ఊగిపోయేలా డ్యాన్స్ చేసింది. ఇప్పుడు వైష్ణవి ని కూడా కీర్తి సురేష్ తో పోలుస్తూ సోషల్ మీడియా లో ఆ రెండు వీడియోల ను వైరల్ చేస్తున్నారు. కీర్తి సురేష్ కి ఈక్వల్ గా వైష్ణవి తీన్మార్ డ్యాన్స్ తో అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ఇన్నాళ్లు యూట్యూబ్ హీరోయిన్ మాత్రమే అనిపించుకున్న వైష్ణవి చైతన్య బేబీ తో సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటగలదని ప్రూవ్ చేసుకుంది.

బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కూడా తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇదివరకు తను చేసిన సెటైరికల్ సినిమాల కు పూర్తిగా భిన్నంగా బేబీ వచ్చింది. ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా లో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు కూడా తమ పాత్రల కు పూర్తి న్యాయం చేశారు. బేబీ సినిమా సక్సెస్ ఈ యంగ్ టీం కి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా పరుగులు తీస్తుంది. సినిమా హంగామా చూస్తుంటే 50 కోట్ల గ్రాస్ దాటి రికార్డ్ వసూళ్లు తెచ్చే అ ఛాన్స్ ఉందని అనిపిస్తుంది.